పొట్టి దుస్తులు వేసుకున్న యువతిపై కంగనా రనౌత్ ఫైర్

Kangana Ranaut : రోజుకో వార్తతో సోషల్ మీడియాలో, మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వైరల్ గా మారింది. సినిమాలతోనే కాదు.. అనేక కారణాలతో వార్తల్లో నిలుస్తోన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఓ యువతి దుస్తులపై కామెంట్స్ చేస్తూ వార్తల్లోకెక్కింది. దీంతో కంగనా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ఓ యువతి ధరించిన దుస్తులపై స్పందించిన కంగనా.... గుడికి వచ్చే సమయంలో సరైన దుస్తులు ధరించి రావాలని సూచించింది. దీంతో కంగనా చేసిన ఈ కామెంట్లుపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని బైజ్‌నాథ్ ఆలయానికి వచ్చిన ఓ యువతి పొట్టి దుస్తులు ధరించింది. ఆ ఫొటోను ట్విట్టర్ ఖాతాలో ఎవరో షేర్ చేశారు. దీన్ని చూసిన కంగనా ఊహించని రీతిలో ఫైర్ అయింది. ఆ యువతికి ట్విట్టర్లోనే క్లాస్ తీసుకుంది. ఈ డ్రెస్ వేసుకున్న వారు.. ఇవి మామూలు బట్టలు అనుకుంటారని తెలిపింది. అటువంటి వారికి సోమరితనం ఉందని అర్థం తప్ప మరొకటి కాదని విమర్శించింది. వారికి అది తప్ప వేరే ఉద్దేశం లేదని తాను అనుకుంటున్నానని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి మూర్ఖులకు కఠిన నిబంధనలు ఉండాలని కంగనా రనౌత్ ఘాటుగా ట్వీట్ చేసింది.

'ఇవన్నీ పాశ్చాత్యులు తయారుచేసిన, ప్రచారం చేసిన బట్టలు. ఒకసారి వాటికన్ వెళ్లాను. షార్ట్, టీ షర్ట్ వేసుకుని ఉండడంతో నన్ను లోపలికి అనుమతించలేదు. నేను తిరిగి హోటల్‌కి వెళ్లి బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది.' అని కంగనా రనౌత్ ట్వీట్ లో రాసుకొచ్చింది. ఇక ఈ విధంగా చేసిన కంగనా మాటలతో కొందరు ఏకీభవించారు. కానీ మరికొందరు మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. 'ఇది కరెక్ట్ కాదు. మీరు సినిమాల్లో అలాంటి దుస్తులను ప్రమోట్ చేస్తారు కదా. అప్పుడు మీరు వేసుకుంటే తప్పు కాదు, కానీ ఇతరులు వేసుకుంటే తప్పా? మీపై ఎవరైనా కామెంట్స్ చేస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది కదా' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'ఇప్పుడు ఫెమినిస్టులంతా వచ్చి వెళ్లిపోతారు..' అని మరో వ్యక్తి కామెంట్ చేయడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా ఇటీవలే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, కంగనా రనౌత్ తదితరులు కలిసి కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా తీసిన ఫొటోను కూడా ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆలయ సందర్శన సమయంలో కంగనా సాంప్రదాయ నీలిరంగు దుస్తులను ధరించి ఉంది. నుదుటిపై గంధాన్ని పూసుకుని ఉన్న ఫొటోలను పోస్ట్ చేసిన ఆమె.. శివుడి దివ్యశక్తి ఉండే తీర్థయాత్రను సందర్శించడం ఎంత అదృష్టమో అనే క్యాప్షన్ ను జత చేసింది.

కంగనా ప్రస్తుతం 'ఎమర్జెన్సీ' చిత్రంతో కంగనా బిజీగా ఉంది. ఈ సినిమాలో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న కంగనా.. ఈ సినిమాకు ఆమే దర్శకత్వం వహిస్తుండడం చెప్పుకోదగిన విషయం. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోకి వచ్చింది. విశేషమేమిటంటే ఇటీవల విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని వీక్షించారని, ఆయనకు ఈ సినిమా నచ్చింది. అంతే కాదు చాలా సీన్లు చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నట్లు తాజాగా కంగనా రనౌత్ స్వయంగా వెల్లడించింది.

Read Also : డైరెక్షన్ ఫీల్డ్‌లోకి నటి కీర్తి సురేశ్ సోదరి

2023-05-26T10:17:39Z dg43tfdfdgfd