Amit Sadh-nature’s beauty: 'సుల్తాన్', 'జీత్ కీ జిద్', 'అవ్రోధ్', 'బ్రీత్' తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించిన నటుడు అమిత్ సాద్ ప్రస్తుతం నెల రోజుల పాటు భారతదేశంలో మోటార్ సైకిల్ ట్రిప్ లో ఉన్నారు. ఇది అతని సాహస యాత్ర మాత్రమే కాదు.. ప్రకృతి పరిరక్షణకు తనవంతుగా కృషి చేస్తూ అనేక మంది పర్యాటకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రస్తుతం నెల రోజుల పాటు భారత్ లో మోటార్ సైకిల్ యాత్ర చేస్తున్న నటుడు అమిత్ సాధ్ ప్రకృతి అందాలను పరిరక్షించేందుకు పర్యాటకులను ప్రేరేపిస్తున్నారు. ఇది అతనికి సాహసం మాత్రమే కాదు. ప్రకృతి అందాలను పరిరక్షించడానికి కూడా ఆయన ఎంతో నిబద్ధతతో ఉన్నారు. తన ప్రయాణంలో బాలాసినోర్, అహ్మదాబాద్, జోధ్ పూర్, జైపూర్, ఢిల్లీ, చండీగఢ్, థియోగ్, సంగ్లా, కాజా, జిస్పా, పూర్ణే, పాదుమ్, కార్గిల్, లేహ్ వంటి అనేక ప్రదేశాలను సందర్శించారు. తన ట్రిప్ ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రదేశాలను పరిశుభ్రంగా, అందంగా ఉంచేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. ప్రయాణికులందరికీ మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు.
అమిత్ నిజంగా తన దేశాన్ని ప్రేమిస్తారు. పర్యావరణం గురించి చాలా ఆందోళన చెందుతారు. అందుకే దానికి హాని జరగడం తనకు ఇష్టం లేదనీ, తన ప్రయాణంలో ఒక అద్భుతమైన స్టాప్ రచ్చమ్ లో జరిగిందని తెలిపారు. తన విరామ సమయం తీసుకుని అక్కడ పర్యాటకులు వదిలివెళ్లిన చెత్తను సేకరించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి అమిత్ స్వచ్ఛందంగా చొరవ తీసుకున్నాడు. మన పరిసరాల పరిశుభ్రతను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రయాణికుడికి ఉందనీ, పర్యావరణంపై మన ప్రభావాన్ని తగ్గించాలనే ప్రగాఢ నమ్మకాన్ని ఆయన చర్యలు ప్రతిబింబిస్తున్నాయి.
అమిత్ సాధ్ తన అద్భుతమైన ప్రయాణం ముగింపుకు చేరుకున్నప్పుడు, అతను ప్రకృతి, భారతదేశం పట్ల తన ప్రేమతో ఇతరులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. తన భవిష్యత్తు ప్రణాళికలలో హాన్లే, సోన్మార్గ్, జమ్మూ ప్రాంతాల్లో ప్రయాణం, అక్కడి పర్యావరణ రక్షణకు చర్యలు తీసుకోవడం ఉన్నాయి. అమిత్ తన అద్బుతమైన, సాహసోపేతమైన ప్రయాణం గురించి వివరిస్తూ.. "నేను రోడ్డుపైకి వచ్చినప్పుడల్లా, రైడింగ్ నిజంగా నాకు ఆత్మ మేల్కొలుపు అనుభవంగా మారుతుంది. మన దేశంలోని వివిధ మూలల నుండి వచ్చిన ప్రజలను కలుసుకోవడం, రుచికరమైన స్థానిక వంటకాలను ఆస్వాదించడం, వారి విభిన్న సంస్కృతులలో మునిగిపోవడం, మన దేశ అద్భుతమైన సహజ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోవడం నాకు చాలా ఆనందంగా ఉందని" తెలిపారు. ఇదే సమయంలో ఈ ప్రకృతి కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.
(ఆవాజ్ ది వాయిస్ సౌజన్యంతో..)
2023-09-19T07:10:25Z dg43tfdfdgfd