వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా అందరూ కలిసి తమ తమ వార్డుల్లో, పల్లెల్లో మండపాలు నిర్మించి.. గణనాధుడిని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. దీంతో ఎటు చూసినా వినాయక మండపాలు వివిధ ప్రత్యేక రూపాల్లో శోభాయమానంగా కనివిందు చేస్తున్నాయి. ఇక్కడ లేని విధంగా వెరైటీ గణనాధులు ఏర్పాటు చేశారంటే.. ఆ విగ్నేశ్వరున్ని చూసేందుకు భక్తులు, ప్రజలు అధిక వస్తుంటారు. సిరిసిల్ల పట్టణంలో అలాంటి వినాయకుడిపై న్యూస్18 ప్రత్యేక కథనం.
ఐక్యరాజ్య సమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ (Nutritional benefits of millets) సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో మిల్లెట్ ల ప్రాముఖ్యత, ఆరోగ్య పరిరక్షణలో వాటి ప్రాధాన్యతను గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి (Siricilla Town) సిరిసిల్ల పట్టణంలోని హిమాన్షి చిల్డ్రన్స్ హాస్పిటల్ లో.. నిర్వాహకులు మిల్లెట్ (చిరు, తృణ ధాన్యాలు) లతో చేసిన గణేశుడిని ప్రతిష్టించారు.
5 అడుగుల పరిమాణం గల పర్యావరణ అనుకూల చిరుధాన్య (మిల్లెట్) గణేశుడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు. నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకూ మిల్లెట్‌తో చేసిన వివిధ వంటకాలు 9 రోజుల పాటు రోజువారీ భక్తులకు ప్రసాదంగా అందించనున్నారు.
మిల్లెట్లు ప్రోటీన్,ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు వంటి అవసరమైన పోషకాల యొక్క అద్భుతమైన మూలం అవి గ్లూటెన్-ఫ్రీ, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి. వాటిని బియ్యం లేదా గోధుమలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చేస్తుంది. ఈ గణనాధున్ని చూసేందుకు భక్తులు పట్టణ వాసులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది.
2023-09-19T12:09:27Z dg43tfdfdgfd