పుట్ట మధును గెలిపిస్తే మంథనిని కేసీఆర్ దత్తత తీసుకున్నట్లే : కల్వకుంట్ల కవిత
కాటారం, వెలుగు : ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుని గెలిపిస్తే సీఎం కేసీఆర్ మంథని నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నట్లేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆమె మాట్లాడారు.
మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులని అణగదొక్కారని, ఉద్యమంలో భాగంగా తాను కాటారంకు వస్తే ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మధుని గెలిపిస్తేనే మంథని నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌నేత, మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణి తదితరులు పాల్గొన్నారు
©️ VIL Media Pvt Ltd. 2023-11-20T01:51:18Z dg43tfdfdgfd