బండ్ల గణేష్ అనుకుంటే..సంపూర్ణేష్ బాబు సీన్ లోకి వచ్చాడే

ఏదైనా ఒక భాషలో ఒక సినిమా హిట్టైందంటే మిగతా భాషల్లో దాన్ని రీమేక్ చేయటానికి దర్శక,నిర్మాతలు ఉత్సాహం చూపిస్తూంటారు. అదే సమయంలో ఆ రీమేక్ లో నటించటానికి నటీనటులు సైతం పోటీ పడతారు.  ఆ మధ్యన త‌మిళంలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ యోగిబాబు హీరోగా న‌టించిన చిత్రం వచ్చి సక్సెస్ అయ్యింది. దాని పేరు మండేలా. తమిళ  సినీ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.  ఓటీటీ వేదిక‌గా విడుద‌లైన ఈ సినిమా తెలుగు సినీ ల‌వ‌ర్స్‌ను అట్రాక్ట్ చేసింది. విభిన్న కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాపై  తెలుగు మేక‌ర్స్ చూపు ప‌డింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నట్లు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఈ సినిమా చూసిన ఓ డైరెక్ట‌ర్ బండ్ల గ‌ణేశ్ ఇందులో న‌టిస్తే బాగుంట‌ద‌ని భావించి.. అత‌నికి చెప్పాడ‌ని, దానికి గ‌ణేశ్ కూడా ఓకే చెప్పాడ‌ని చ‌ర్చ జ‌రిగింది. అంతేకాకుండా ఈ సినిమాను బండ్లా గ‌ణేశ్ స్వ‌యంగా నిర్మించ‌నున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే  ఆ వార్తలు రూమర్స్ గానే మిగిలిపోయాయి. అంతా మర్చిపోయాక ఇప్పుడు ఈ సినిమా రీమేక్ ప్రకటన వచ్చింది. అయితే సంపూర్ణేష్ బాబు హీరోగా ఈ సినిమా నిర్మిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.  రాజకీయ నేపథ్యంలో, సమాజంలోని పరిస్థితులపై సెటైర్ వేస్తూ తెరకెక్కిన చిత్రమిది. 

 'మండేలా' చిత్రానికి తమిళంలో మడోన్నా అశ్విన్ దర్శకత్వం వహించారు. ఆ డైరక్టర్ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా...శివ కార్తికేయన్ 'మహావీరుడు' తీసింది కూడా మడోన్నా అశ్వినే. ఇప్పుడు ఆ 'మండేలా' సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) హీరోగా నటించిన సినిమా 'మార్టిన్ లూథర్ కింగ్' (Martin Luther King Telugu Movie). ఇది ' మండేలా'కు రీమేక్. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమె తొలి సినిమా ఇది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించింది. ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలు కాగా... వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్! ఇవాళ సినిమాలో సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

పనిలో పనిగా అక్టోబర్ 27న 'మార్టిన్ లూథర్ కింగ్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఈ రోజు చిత్ర టీమ్  అనౌన్స్ చేసింది. సినిమా ఫస్ట్ లుక్ చూస్తే... సంపూర్ణేష్ బాబు తల మీద ఓ కిరీటం, అందులో రాజకీయ నాయకులు ప్రచారం చేయడం చూడవచ్చు. డప్పు గుర్తుకే మీ ఓటు, లౌడ్ స్పీకర్ గుర్తుకు మీ ఓటు బ్యానర్లు కనిపించాయి. డప్పు గుర్తు తరఫున పోటీ చేసే రాజకీయ నాయకుడిగా సీనియర్ నరేష్ కనిపించనున్నారు.

మండేలా చిత్రంలో తమిళంలో  కమెడియన్ యోగిబాబు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి రెండు నేషనల్ అవార్డ్స్ తో పాటుగా.. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో ఇండియా నుంచి షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా మండేలా నిలిచింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత రీమేక్ ను నమ్ముకుని వస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. తమిళంలో స్దాయి సక్సెస్  సాధిస్తాడో లేదో చూడాలి? 

2023-09-19T09:55:33Z dg43tfdfdgfd