భర్తతో కావాలని శృంగారాన్ని నిరాకరించడం క్రూరత్వమే.. ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ : భార్యాభర్తల వివాదంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్తతో శృంగారంలో పాల్గొనడానికి  లైఫ్ పార్ట్నర్ కావాలనే దూరంగా ఉండడం క్రూరత్వమే అవుతుందని  తెలిపింది. ఈ మేరకు ఓ వ్యక్తి పెట్టుకున్న విడాకుల నిర్ణయాన్ని ఫామిలీ కోర్టు మంజూరు చేసింది. ఫ్యామిలీ హైకోర్టు నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. 

వైవాహిక బంధంలో శృంగార జీవితానికి దూరం కావడం అత్యంత దారుణమని.. అంతటి క్రూరత్వం మరొకటి ఉండదని కోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. 2004లో ఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత 35 రోజులపాటు మాత్రమే వీరు కలిసి ఉన్నారు. 35 రోజుల తరువాత భార్య పుట్టింటికి వెళ్ళింది. ఆ తర్వాత ఎంతకీ తిరిగి రాలేదు. 

పార్లమెంట్ భవనం వద్ద ఫోటో సెషన్: పాల్గొన్న ప్రధాని మోడీ సహా పలు పార్టీల ఎంపీలు

భర్త ఎంత పిలిచినా రాలేదు. ఇక విసిగిపోయిన భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశాడు. అతని అభ్యర్థనను పరిశీలించిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే, ఢిల్లీ హైకోర్టులో ఈ తీర్పును భార్య సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది. దీని మీద ఇటీవలే విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పును ప్రకటించింది. ఈ కేసులో తీర్పునిస్తూ కోర్టు కొన్ని వివరాలను పేర్కొంది.. దాని ప్రకారం ‘సెక్సువల్ లైఫ్ లేని వివాహ బంధం ఊహించలేనిది.  

సెక్సువల్ లైఫ్ కి భార్య నిరాకరించింది. దీంతో వైవాహిక బంధం పరిపూర్ణం కాదు. దీనికి తోడు ఆధారాలే లేకుండా భార్య.. భర్తమీద వరకట్న వేధింపుల కేసు పెట్టింది. లైఫ్ పార్ట్నర్ ఉద్దేశపూర్వకంగా శృంగారానికి నిరాకరించడం క్రూరత్వం అవుతుంది. కొత్తగా దాంపత్య జీవితంలోకి ప్రవేశించిన వారికి ఈ పరిస్థితి రావడం ఇంకా దారుణం’  అని కోర్టు వ్యాఖ్యానించింది.

2023-09-19T05:55:14Z dg43tfdfdgfd