భూమిలో నుంచి పెరుగుతూ వస్తున్న గణపతికి పూజలు

తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా అక్కడ గణపతిస్వామి పంటపొలాల్లో నిత్యం పెరుగుతూ వస్తున్నారు. ఆ గణపతి స్వామిని దర్శించి ఆయన చెవిలో ధర్మపద్ధంగా మూడు కోర్కెలు కోరితే చాలు స్వామి తప్పక తీరుస్తారని భక్తులు ప్రగాఢ విశ్వాసంగా చెబుతారు. అటువంటి పవిత్ర గణపతి స్వామి ఆలయం ఎక్కడ ఉంది అక్కడ గణపతి నవరాత్రులు దేవదాయ ధర్మదాయ శాఖ ఎంత ఆధ్యాత్మిక పరంగా నిర్వహిస్తుంది ఆ కార్యక్రమా వివరాలు ఒకసారి చూద్దాం.. పచ్చని పంట పొలాలకు నిలవైనా తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) అనపర్తి ప్రాంతంలో గల బిక్కవోలు పవిత్ర గణపతిస్వామి దివ్యక్షేత్రం (Bikkavolu Ganesh Temple) అదిపచ్చని పంట పొలాల్లో అక్కడ స్వామి వారు నిత్యం రూపంలో పెరుగుతూ వస్తున్నారు.

అక్కడ గణపతి స్వామి అత్యంత శక్తివంతమైన స్వామి అని భక్తులు ప్రగాఢ విశ్వాసంగా చెబుతారు పచ్చని పంట పొలాల్లో కొలువైన శ్రీ బిక్కవోలు గణపతి స్వామిని దర్శించిన స్వామివారి కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న స్వామి వారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారి దివ్య క్షేత్రంలో అత్యంత ఘనంగా ఉత్సవాల నిర్వహించేందుకు దేవదాయ ధర్మదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తొలి రోజు స్వామివారి దివ్య మంగళస్వరూపానికి పాలు పెరుగు పంచదార మొదలగు వైదిక క్రధులతో పంచామృత అభిషేకం భక్తుల చేతుల మీదగా నిర్వహించింది అదేవిధంగా స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన పశుపాభిషేకం కుంకుమభిషేకం సైతం నిర్వహించి వెండికవచ దారణలో స్వామివారిని అర్చక స్వాములు భక్తులకు దర్శనం కల్పించారు.

ఇది చదవండి: అక్కడ రోజురోజుకు పెరుగుతున్న వినాయకుడు..

ఈ నవరాత్రులు స్వామివారికి విశేష ఉత్సవాలు లోకకళ్యాణార్థం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రత్యేక హారతులు జరుగుతాయని ఈ చక్కని కార్యక్రమాలలో భక్తులంతా పాల్గొని శ్రీ బిక్కవోలు గణపతి స్వామి ఆశీస్సులు నిండుగా తీసుకోవాలని దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు పిలుపునిస్తున్నారు. అనపర్తి సమీపంలో బిక్కవోలు ప్రాంతంలో స్వయంభు స్వామిగా వెలిసిన శ్రీ గణపతి స్వామి రోజు రోజుకు ఆయన విగ్రహరూపంలో పెరుగుతూ వస్తున్నారు. ఆయన భూమిలో కూర్చుని ఉన్న రూపం మనకు దర్శనమిస్తుంది ఆ పక్కనే స్వయంభు సుబ్రమణ్య స్వామి సైతం దర్శనం ఇస్తారు ఒకే చోట దర్శనమిస్తున్న గణపతి సుబ్రహ్మణ్యస్వామి వాళ్లను దర్శించి స్వామి వారి ఆశీస్సులు పొందాలని అర్చకులు పిలుపునిచ్చారు. అదే విధంగా లోక కళ్యాణార్థం జరుగుతున్న ప్రత్యేక హోమాల్లో భక్తులు దంపతుల సమేతంగా పాల్గొని పేర్కొన్నారు అదేవిధంగా ప్రకృతి సోయగం నడుమ ఈ దివ్య క్షేత్రం ప్రత్యేకంగా పలువురిని ఆకట్టుకుంటుంది

2023-09-19T06:39:03Z dg43tfdfdgfd