వినాయకుడు చాలా మందికి ఇష్టమైన దైవం. పిల్లా పెద్దా అందరికీ ఆ దేవాదిదేవుడంటే ఎంతో ఇష్టం. ఆ గణపతి దేవుడు.. ఒక్కో ప్రాంతంలో.. ఒక్కో విధంగా.. ఒక్కో రూపంతో మహిమలు చూపిస్తుంటాడు. కొన్ని చోట్ల స్వయంభువుగా.. కొన్ని చోట్ల చెట్లలో ఆకారంగా..? కొన్ని చోట్ల విగ్రహ ప్రతిష్టతో చక్కని తండ్రిగా భక్తుల పూజలు అందుకుంటాడు. ఈశ్వర తనయుడైన ఆయన విఘ్నాలను తొలగించడంలో ముందుంటాడని నమ్మిక. అయితే ఒక చోట గణపతిని దర్శించుకుంటే.. మాత్రం కన్ను దిష్టి ఉండదు. చెడు చూపు ప్రభావం అసలే ఉండదని భక్తులు నమ్ముతారు. ఆ చోటు ఎక్కడో మీరే చూసేయండి.ఇది చాలా చిన్న ఆలయం. విశాఖ నగర నడిబొడ్డున ఉన్న మందిరం. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంగా పేరు. అయితే మర్రిచెట్టు గణపతిగా చాలామందికి తెలుసు. విశాఖ దొండపర్తిలోని అత్యంత రద్దీ అయిన ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది. చూడటానికి నలుగురు మనుషులు కూడా పట్టిన ఇరుకైన గుడి. కానీ.. ఇక్కడి గణేషుడి మహిమలు మాత్రం విశ్వవ్యాప్తం. ఆయన్ని మొక్కుకుంటే చాలు కోరిన కోర్కెలు తీరుస్తాడు. న్యాయబద్ధంగా.. సహేతుకంగా ఉండే కోరికను ఆయన ముందు నుంచుని కోరితే.. మండల కాలంలో ఎలాంటి కోరికైనా తీరుతుందట. ఇది జరిగిన.. ఇప్పటికీ జరుగుతున్న మహిమే అంటారు ఇక్కడి భక్తులు కొందరు.శ్రీశైలం వెళ్తున్నారా? ఈ వార్త మీ కోసమే!విశాఖ దొండపర్తిలోని ఈ ఆలయంలో మర్రిచెట్టు కిందే వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం ప్రతిష్టించి సుమారు నలభై ఏళ్లు అవుతోంది. అయితే ఈ విగ్రహానికి ముందు ఈ మర్రి చెట్టు మొదట్లోనే ఆంజనేయుడి ముఖం, వినాయకుడి రూపం ఉండేదట. అలాగే సర్పాకారంలో మర్రి తొర్రలు ఉండేవని.. అవి కాండంలా మారి ఇప్పుడు ఆలయంలోనే ఉన్నాయంటున్నారు. ప్రత్యేకించి గర్భగుడి అంటూ ఏది లేని ఆలయంలో కేవలం గణేషుడి విగ్రహం పూజలందుకుంటుంది. ఈ కారణంగానే చెడు ప్రభావం.. నర ఘోష, చెడు దృష్టి వంటివి ఈ ఆలయానికి వస్తే చాలు మాసిపోతాయని అర్చకుడు అయ్యప్ప శర్మ అంటున్నారు.ప్రతి బుధవారం, సోమవారం, శనివారం మర్రిమాను వినాయకుడికి ప్రత్యేకించి అభిషేకాలు జరుగుతాయి. ఈ అభిషేకం తర్వాత ఆ జలం.. కొన్నిరకాల పువ్వులు ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. ఇవి ఇంట్లో ఉంటే చెడు ప్రభావం పోతుందట. అలాగే కొన్ని ప్రత్యేకించిన తాయెత్తులు ఈ స్వామి వారి ఆలయంలోనే కడతారు. ఇక ఇక్కడ ఒకసారి పూజ చేస్తే పదిసార్లు చేసినట్టు.. పది సార్లు చేస్తే.. వందసార్లు చేసిన ఫలితం వస్తుందట. సాధారణ ఆలయాల్లో ఒకసారి నామజపం చేస్తే ఒకటే ఫలితం. కానీ.. ఇక్కడ మాత్రం ఒకసారి నామజపం చేస్తే.. పదిసార్లు.. పది సార్లు చేస్తే వందసార్లు.. అంటే.. పదింతల ఫలితం ఉంటుందని అర్చకులు చెబుతున్నారు.40 పైసలకే రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు రుణాలు.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..భక్తులు కూడా నిత్యం ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు. అయితే కొందరు రోడ్డు బయట నుంచే దండం పెట్టుకుని వెళ్లిపోతుంటారు. అలా చేసినా.. పుణ్యమే అంటారు అర్చకులు. ఈ స్వామిని దూరం నుంచీ చూసి దండం పెట్టినా చాలు ఆయన కరుణ ఉంటుందని అంటున్నారు. అలాగే ఇక్కడ నిత్యం స్వామికి విశేష పూజలు నిర్వహిస్తామని.. తమ గురువు సుబ్రమణ్యం, ఆలయ ధర్మకర్త రెడ్డి ప్రత్యేకించి ఇవి జరిపిస్తారని వివరించారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఒకసారి ఈ ఆలయానికి వచ్చేయండి.
2023-11-20T14:41:23Z dg43tfdfdgfd