మళ్లీ పెళ్లి సినిమా విడుదలకు ముందు నరేష్, పవిత్రలకు షాక్.. ఆ విషయంలో కోర్టును ఆశ్రయించిన రమ్య రఘుపతి..

హైదరాబాద్‌: నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘‘మళ్లీ పెళ్లి’’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుండగా కీలక పరిణామం చోటుచేసుకుంది. 

హైదరాబాద్‌: నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘‘మళ్లీ పెళ్లి’’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుండగా కీలక పరిణామం చోటుచేసుకుంది. 

నరేష్ మూడో భార్య రమ్య రఘపతి ఈ చిత్రంపై కోర్టును ఆశ్రయించారు. మళ్లీ పెళ్లి సినిమా విడుదలను నిలిపివేయాలని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. 

ఈ చిత్రంలో తన ప్రతిష్టను కించిపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. మళ్లీ  పెళ్లి చిత్రాన్ని  ఆపాలని  కోరారు.  రేపు మళ్లీ పెళ్లి  చిత్రం విడుదల కానుండగా.. రమ్య రఘపతి సినిమా విడుదలను ఆపాలని కోర్టుకెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలా ఉంటే.. నరేష్, పవిత్ర జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. నటుడు నరేష్ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక, మళ్లీ పెళ్లి చిత్రాన్ని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మే 26న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి నరేష్, పవిత్రలు భారీగా ప్రమోషన్స్ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. 

2023-05-25T08:30:37Z dg43tfdfdgfd