మహిళా అర్చకులకు అభినందనలు తెలిపిన ఉదయనిధి స్టాలిన్

మహిళా అర్చకులకు అభినందనలు తెలిపిన ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు ప్రభుత్వ అర్చక శిక్షణ పాఠశాలలో శిక్షణ పొందిన మహిళా అర్చకులను కలిశారు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఇటీవల రంజిత, కృష్ణవేణి, రమ్యలు తమిళనాడు ప్రభుత్వ అర్చక శిక్షణ పాఠశాలలో శిక్షణ పొంది సర్టిఫికెట్లు పొందిన సందర్భంగా ఉదయ నిధి వారిని అభినందించారు. ఒక్కొక్కరికి స్మార్ట్ ఫోన్, రూ. 25వేల నగదు చొప్పున అంజేశారు. 

ALSO READ: ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే

కృష్ణ వేణి, రమ్య, రంజిత ముగ్గురిని మహిళా పూజారులు ధృవీకరించింది తమిళనాడు ప్రభుత్వం. వీరు రాష్ట్ర ప్రభుత్వ హిందూ మత, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పూజారులుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిని త్వరలో రాష్ట్రంలోని ఆలయాల్లో సహాయ అర్చకులుగా నియమించనున్నారు.ఈ కోర్సులో మహిళలు చేరడం ఇదే తొలిసారి. 

©️ VIL Media Pvt Ltd.

2023-09-18T14:56:38Z dg43tfdfdgfd