మహేష్ బాబుతో చేయాల్సిన సినిమాతో పాటు ఇంకోటి కూడా.. ప్లాన్ మార్చిన రాజమౌళి.. దర్శకధీరుడి ప్రకటన

Rajamouli Made in India దర్శకధీరుడు రాజమౌళి తన కొత్త సినిమాను ప్రకటించాడు. అయితే ఈ కొత్త సినిమాకు ఆయన దర్శకుడు కాదు. కేవలం సమర్పకుడు. తన కొడుకుని ఈ సినిమాతో నిర్మాతగా మార్చాడు. రాజమౌళి సమర్పణలో ఎస్ ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీ మీద రాజమౌళి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. మేడ్ ఇన్ ఇండియా అంటూ ఈ సినిమా రాబోతోందంటూ రాజమౌళి ట్వీట్ వేశాడు.

ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి నుంచి వచ్చే ప్రాజెక్ట్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌తో రాజమౌళి క్రేజ్ హాలీవుడ్ స్థాయికి వెళ్లింది. ఇప్పుడు రాజమౌళి ఏం చేసినా కూడా హాలీవుడ్ స్టాండర్డ్‌లోనే ఉండాలి. అందుకే జక్కన్న సైతం ఆ రేంజ్‌లోనే అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాడు. మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం ఆఫ్రికా నేపథ్యాన్ని ఎంచుకున్నాడు.

ఫస్ట్ కథ,కథనం విన్నప్పుడే నేను కదిలిపోయాను.. ఎంతో ఎమోషనల్‌కు లోనయ్యాను.. అసలు బయోపిక్ అనేది చేయడమే చాలా కష్టమైన పని.. అలాంటిది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ తీసి మెప్పించడం అంటే అది పెద్ద సవాలే.. మా వాళ్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు.. మేడ్ ఇన్ ఇండియాను ఎంతో సగర్వంగా ప్రజెంట్ చేస్తున్నాను అని రాజమౌళి ట్వీట్ వేశాడు.

రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నాడంటే.. ఆ కథ, కథనం, మేకింగ్, టేకింగ్ ఇలా అన్నింట్లోనూ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. రాజమౌళి సలహాలు తీసుకుని ఉంటారు. ఈ ప్రాజెక్ట్ మీద రాజమౌళి కూడా టైం వెచ్చించి ఉంటాడు. మరో వైపు విజయేంద్ర ప్రసాద్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబంధించిన కథను వండే పనిలో ఉన్నాడు. ఇంకా పూర్తి స్క్రిప్ట్ రెడీ అవ్వలేదన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు చాన్స్ ఉంది. ఈ ఏడాదిలోనే ఆ చిత్రానికి సంబంధించిన లాంచింగ్, పూజా కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయో చూడాలి.

2023-09-19T06:28:06Z dg43tfdfdgfd