రజినీకాంత్ మనవడికి ట్రాఫిక్ పోలీసుల చలానా

రజినీకాంత్ మనవడికి ట్రాఫిక్ పోలీసుల చలానా

చట్టం ఎవరికి అయినా ఒక్కటే అని చెన్నై పోలీసులు చాటి చెప్పారు. సినిమా తారల విషయంలో తాము పక్షపాత ధోరణితో వ్యవహరించడం లేదని తమ చర్యల ద్వారా చూపించారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియోల పట్ల పోలీసుల వ్యవహార ధోరణి ఏ విధంగా ఉందనేది చెప్పడానికి చెన్నైలో జరిగిన అంశం ఓ ఉదాహరణ. పూర్తి వివరాల్లోకి వెళితే... 

త‌మిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మనవడు, హీరో ధనుష్ (dhanush) తనయుడు యాత్రకు తమిళనాడు పోలీసులు జరిమానా విధించారు. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్‌ల పెద్ద కుమారుడు యాత్ర కొన్ని రోజుల కింద‌ట‌ ఓ స్పోర్ట్స్ బైక్ పై రయ్యిమంటూ దూసుకెళుతూ కనిపించాడు. అయితే ఆ సమయంలో యాత్రకు హెల్మెట్ లేదు. అతను తన తాత రజనీకాంత్ ఇంటి నుండి తన తండ్రి ధనుష్ ఇంటికి బైక్ పై వెళ్లినట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై చెన్నై ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టగా అది ధనుష్ కొడుకు యాత్రది అని తేలింది. దీంతో ఈ విష‌యంపై ట్రాఫిక్ పోలీసులు ధనుష్ ఇంటికి వెళ్లి యాత్రకు సలహా ఇచ్చారు. అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు యాత్రకు రూ.1000 జరిమానా విధించారు.

చెన్నైలోని పోయెస్ గార్డెన్ ఏరియాలో ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర బైక్ రైడింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాన్ని చూసిన పోలీసులు ధనుష్ ఇంటికి వెళ్లి ఫైన్ వేశారు. 

యాత్ర బైక్ రైడింగ్ నేర్చుకుంటున్నాడని, అతడితో వెంట ట్రైనర్ కూడా ఉన్నారని ధనుష్ కుటుంబ సభ్యులు వివరించారు. అయితే... హెల్మెంట్ లేకుండా బండి నడపకూడదని, అందుకు గాను జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అదీ సంగతి! నిష్పక్షపాతంగా వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసుల తీరు పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  

©️ VIL Media Pvt Ltd.

2023-11-20T16:52:24Z dg43tfdfdgfd