రాజా రవీంద్ర కోసం రాజ్ తరుణ్.. అందుకే ముందుకు వచ్చాడా?

రాజా రవీంద్ర ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉండే నటుడు. రాజా రవీంద్ర ఎక్కువగా కాంట్రవర్సీలతోనే వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన మాట ఎంతో కఠువుగా ఉంటుంది. కానీ ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు. దాని వల్ల తనకు ఎన్నో సమస్యలు వచ్చాయని కూడా ఎన్నో సార్లు చెబుతుంటాడు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన రాజా రవీంద్ర.. ఇండస్ట్రీలో ఎంతో హీరోలకు డేట్స్ చూస్తుంటాడు. మేనేజర్‌గా వ్యవహరిస్తుంటాడు.

కుర్ర హీరోలకు ఓ గైడెన్స్ ఇస్తుంటాడు. రాజ్ తరుణ్‌కు సైతం రాజా రవీంద్ర మేనేజర్ అన్న సంగతి తెలిసిందే. కుమారి 21ఎఫ్ సినిమాను సెట్ చేసింది కూడా ఈయనే. అలా రాజ్ తరుణ్ కెరీర్‌ను గాడిన పెట్టడంతో రాజా రవీంద్ర కృషి కూడా ఉందని అంటుంటారు. అయితే రాజా రవీంద్ర చాలా రోజుల తరువాత ఓ ఫుల్ పాజిటివ్ రోల్‌లో మెయిన్ లీడ్‌గా కనిపించబోతోన్నాడు. సాయిజ క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు దివ్యాశిస్సులతో ఉమాదేవి శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం సారంగదరియా.

ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను రాజ్ తరుణ్ విడుదల చేశాడు. తన కోసం ఎన్నో చేసిన రాజా రవీంద్ర కోసం ఇలా ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తోంది. రాజ్ తరుణ్ చాాలా రోజులకు ఇలా ఓ సినిమా ప్రమోషన్స్‌‌లోకనిపించాడు. రాజ్ తరుణ్ సైతం సరైన హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

సారంగదరియా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని, టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో పాజిటివ్‌గా ఉందని అన్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రంలో రాజా రవీంద్ర అన్న మెయిన్ లీడ్‌గా నటించాడని, దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ తెలిపాడు రాజ్ తరుణ్.

డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి మాట్లాడుతూ.. మా మూవీ పోస్టర్ విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి థాంక్యూ అని, చిత్రం బాగా రావడానికి సపోర్ట్ చేసిన రాజా రవీంద్ర, ఇతర టీం సభ్యులకు థాంక్స్ తెలిపాడు.

2023-11-21T05:44:40Z dg43tfdfdgfd