రెమ్యూనరేషన్ తీసుకోను.. లాభాల్లో షేర్ తీసుకుంటా : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అషూ రెడ్డి కొత్త షో దావత్‌లో కిరణ్ అబ్బవరం ఫస్ట్ గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమో వచ్చి నెల రోజులకు పైగానే అవుతోంది. తాజాగా ఎపిసోడ్‌ను యూట్యూబ్‌లో వదిలినట్టున్నారు. దీంతో ఆ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. జెన్యూన్‌గానే సమాధానాలు చెప్పినట్టుగా కనిపిస్తోంది. ఇక తన సినిమా ఫ్లాపుల మీద ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆన్సర్‌లు ఇచ్చాడు.

మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే చిత్రాలు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు అని చేశారా? అంటూ అషూ అడిగింది. అవును అంటూ సమాధానం ఇచ్చాడు. ఒక వేళ మీరే నిర్మాతలు అయి ఉంటే ఆ సినిమాలు నిర్మించేవారా? అని మళ్లీ అడిగింది అషూ. నిర్మాతగా అయితే నిర్మించేవాడ్ని కాదని అంటాడు.

ఒక్కో మాటలో ఒక్కో సినిమాకు రివ్యూ ఇవ్వండని అషూ రెడ్డి అంటుంది. రాజా వారు రాణిగారు క్యూట్ లవ్ స్టోరీ అని, సమ్మతమే న్యూ లవ్ స్టోరీ అని, మీటర్ అవుట్ డెటెడ్ కమర్షియల్ మూవీ, నేను మీకు బాగా కావాల్సిన వాడిని.. కానీ మనకు ఆ చిత్రం అంతగా కావాల్సింది కాదు అని అందర్నీ నవ్వించాడు.

మీరు రెమ్యూనరేషన్ తీసుకోరట.. లాభాల్లో ప్రాఫిట్స్ తీసుకుంటారట కదా? అని అషూ రెడ్డి అడిగింది. ముందు ఎంతో కొంత తీసుకోవడం కంటే.. సినిమా అంతా అయ్యాక.. నిర్మాతకు పెట్టింది వచ్చాక.. లాభాలు వస్తే తీసుకుందామనుకుంటాను.. అందులో షేర్ తీసుకుంటాను.. ఒక వేళ సినిమా పోతే.. నిర్మాతకు ఏం రాకపోతే.. నేను కూడా ఏమీ తీసుకోను అంటూ ఎంతో నిజాయితీగా చెప్పుకొచ్చాడు.

2023-11-20T07:43:05Z dg43tfdfdgfd