రెండో పెళ్లిపై మొదటి భార్య రియాక్షన్.. ఆ ఒక్క విషయం గుర్తుంచుకోండి
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 60 ఏళ్ల వయసున్న ఆశిష్ విద్యార్థి 33 ఏళ్ల రూపాలి బారువాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ల పెళ్లి టాపికే నడుస్తోంది. తాజాగా ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లిపై మొదటి భార్య రాజోషి సోషల్ మీడియా వేధికగా స్పందించింది. ఆమె పెట్టిన వరుస పోస్టులు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.
రాజోషి తన ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్వుతున్న సెల్ఫీని పోస్ట్ చేసి.. "జీవితం అనే పజిల్‌లో గందరగోళానికి లోనవద్దు' అని రాసుకొచ్చింది. ఇక స్టోరీలో.. "అర్థం చేసుకునేవాడు నిన్ను ఎప్పుడూ ప్రశ్నించడు, బాధపెట్టే పనులు చేయడు, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి' అని రాసుకొచ్చింది. మరో స్టోరీలో.. "అతిగా ఆలోచిస్తూ అనవసర సందేహాలు పెట్టుకున్నావేమో.. ఇక మీదట అవి ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన క్లారిటీతో అదంతా తుడిచిపెట్టుకుపోతుంది. ఇంతకాలం నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు, అందరి ఆశీర్వాదాలు తీసుకునే టైమొచ్చింది వచ్చింది, అందుకు నువ్వు పూర్తి అర్హురాలివి" అని రాసుకొచ్చింది.
ఇక ఈ పోస్టులు చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. ఒక వైపు భాద, మరోవైపు సంతోషం.. ఇందులో ఏది నిజం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పోస్ట్స్ పై ఆశిష్ విద్యార్థి రెస్పాండ్ అవుతాడా? లేదా? అనేది చూడాలి మరి.
©️ VIL Media Pvt Ltd. 2023-05-26T08:29:05Z dg43tfdfdgfd