రెండో ప్రపంచయుద్ధానికి సిద్ధమైన ప్రభాస్.. లేటెస్ట్ మూవీపై క్రేజీ టాక్..!

పాన్ ఇండియన్ స్టార్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఒకటైన సలార్ సీస్ ఫైర్ పార్ట్ 1 మూవీ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. సలార్ లో మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా మాస్ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనిని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఆ తరువాత సినిమాలుగా రాజా డీలక్స్ .. ప్రాజెక్టు K లైన్లో ఉన్నాయి. ఇక కన్నప్ప సినిమాలోను ప్రభాస్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు.ఇదీ చదవండి: కెప్టెన్‌ మిల్లర్‌ ఫస్ట్ సింగిల్‌ కిల్లర్‌ కిల్లర్‌ లాంఛ్ టైం ఫిక్స్‌.. ఎప్పుడంటే..?ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మరో ప్రాజెక్టును అంగీకరించినట్టుగా తెలుస్తోంది. తాజాగా హను రాఘవపూడి ఒక కథ చెప్పి ప్రభాస్ ను ఒప్పించినట్టుగా సమాచారం. సీతారామం సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి, ఆ తరువాత సినిమాను ప్రభాస్ తోనే ప్లాన్ చేసుకున్నాడని అంటున్నారు.ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనుండగా దీనిని అత్యంత భారీ స్థాయిలో దాదాపుగా రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారట. అలానే సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ మూవీ లవ్, యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా రూపొందనుందనేది లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ టాక్. కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీ గురించిన పూర్తి వివరాలు మేకర్స్ నుండి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. మరోవైపు ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది తెలియాలి.

2023-11-20T17:11:33Z dg43tfdfdgfd