విద్యార్థుల 90వేల అడ్మిట్ కార్డ్‌లు హ్యాక్.. 19 ఏళ్ల యువకుడు అరెస్టు

విద్యార్థుల 90వేల అడ్మిట్ కార్డ్‌లు హ్యాక్.. 19 ఏళ్ల యువకుడు అరెస్టు

మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి, టెలిగ్రామ్ ఛానెల్‌లో నాన్-గెజిటెడ్ గ్రూప్ B, గ్రూప్ C కేడర్ పరీక్ష కోసం 90వేల కంటే ఎక్కువ అడ్మిట్ కార్డ్‌లను లీక్ చేసినందుకు పూణేకు చెందిన 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఈ పరీక్ష ఏప్రిల్ 30, 2023న జరిగింది. నిందితుడిని పూణేలోని చిఖాలీ నివాసి రోహిత్ దత్తాత్రే కాంబ్లేగా గుర్తించారు. కాగా అతన్ని మే 25న అరెస్టు చేశారు. ఈ నేరంలో పాల్గొన్న మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

సైబర్, డిజిటల్ సైన్స్‌లో రెండో సంవత్సరం చదువుతున్న కాంబ్లే ఏప్రిల్ 23న టెలిగ్రామ్ ఛానెల్ 'MPSC 2023 A'లో ప్రశ్నాపత్రాన్ని లీక్ చేషాడు. కాంబ్లే అనేక హ్యాకింగ్ గ్రూపులలో సభ్యుడని నవీ ముంబై పోలీస్ కమిషనర్ మిలింద్ భరాంబే తెలిపారు.

డార్క్ నెట్‌లోని ఒక సమూహం హ్యాకర్‌కు 4వందల డాలర్లు ఆఫర్ చేసింది

MPSC నాన్-గెజిటెడ్ గ్రూప్ B, C కేడర్ పరీక్షల ప్రశ్నాపత్రాన్ని హ్యాక్ చేయడానికి డార్క్ నెట్‌లోని ఒక సమూహం అతనికి 4వందల డాలర్లు ఆఫర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. విద్యార్థి అడ్మిట్ కార్డులను మాత్రమే హ్యాక్ చేశాడని, ప్రశ్నాపత్రాన్ని హ్యాక్ చేసినట్టు లేదా షేర్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని భరాంబే చెప్పారు.

ఇది కాంబ్లే జీవనశైలి అతని ఆదాయ వనరులపై సందేహాలను లేవనెత్తింది. “కాంబ్లే ఒక విద్యార్థి, అతనికి స్థిరమైన ఆదాయ వనరు లేదు. కానీ అతను విలాసవంతంగా జీవించేవాడు, ఖరీదైన గాడ్జెట్‌లను ఉపయోగించేలాడు”అని భరాంబే చెప్పారు. కాంబ్లే అనేక కోర్సులను అభ్యసిస్తున్నాడు, వాటిలో ఒకటి 'ఎథికల్ హ్యాకింగ్, పెనెట్రేషన్ టెస్టింగ్'. ఇవి నైతిక ప్రయోజనాల కోసం కంప్యూటర్  భద్రతను అంచనా వేయడానికి సాధనాలు. "అతను హ్యాకింగ్ గ్రూపులలో సభ్యుడు, ఇతర నేరాలలోనూ అతని పాత్ర ఉండవచ్చు" అని భరాంబే చెప్పారు.

బేలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు

MPSC నాన్-గెజిటెడ్ గ్రూప్ B, గ్రూప్ C కేడర్ పరీక్షలకు సంబంధించిన 94వేల అడ్మిట్ కార్డులు టెలిగ్రామ్ ఛానెల్‌లో లీక్ కావడంతో బేలాపూర్ పోలీసులు ఏప్రిల్ 25న కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 30న 37 జిల్లాల్లోని 1,475 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. విద్యార్థుల అడ్మిట్ కార్డ్‌లను అక్రమంగా డౌన్‌లోడ్ చేయడం, ఏప్రిల్ 23న టెలిగ్రామ్ ఛానెల్ 'MPSC 2023 A'లో వాటిని ప్రచురించడం గురించి తెలుసుకున్న MPSC జాయింట్ సెక్రటరీ సునీల్ హరిశ్చంద్ర అవతాడే బేలాపూర్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుదారు ప్రకారం, మొత్తం 4,66,455 మంది అభ్యర్థులు పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు. 94,195 మంది విద్యార్థుల అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టిక్కెట్లను చట్టవిరుద్ధంగా డౌన్‌లోడ్ చేసి టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రచురించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను MPSC వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 21, 2023న అందుబాటులో ఉంచారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నందున, కమిషన్ తన వెబ్‌సైట్ https//mpsc.gov.inలో 'అడ్మిషన్ సర్టిఫికేట్' అనే ప్రత్యేక లింక్‌ను కూడా అందుబాటులో ఉంచింది.   ఎక్స్‌టర్నల్ లింక్ ద్వారా, అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ ను ఎంటర్ చేసి OTPతో అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కానీ కాంబ్లే,, అడ్మిట్ కార్డ్‌ల అక్రమ డౌన్‌లోడ్ కోసం వేరే లింక్‌ని ఉపయోగించారు.

        ©️ VIL Media Pvt Ltd.

2023-05-26T06:44:06Z dg43tfdfdgfd