విరాట్-అనుష్కల నుంచి ఇవి నేర్చుకోవాల్సిందే..!

వారి పని వేరు అయినా, వారు ఒకరికోసం మరొకరు సమయం కేటాయిస్తూనే ఉంటారు. ఎవరైనా సరే దంపతులు ఎంతగా కలిసి ఉంటారో, ఆ బంధం అంత బలపడుతుంది.

 

దాంపత్య జీవితం సరగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. దాని కోసం ఏం చేయాలి అనే విషయం మాత్రం చాలా మందికి తెలీదు. అయితే, కొందరిని చూసి మాత్రం ఇవి నేర్చుకోవచ్చు. అలాంటివారిలో విరాట్-కోహ్లీ దంపతులు కూడా ఒకరు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దేశంలోని అత్యంత ప్రజాదరణ, ఇష్టమైన జంటలలో ఒకరు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి ప్రతి జంట స్ఫూర్తి పొందాలి. ప్రతి జంట విరాట్ , అనుష్క నుండి దంపతులు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే..

సమయం ఇవ్వండి

మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, మీ భాగస్వామి కోసం సమయం కేటాయించండి. విరాట్, అనుష్క  విభిన్నమైన కెరీర్‌లు కలిగి ఉన్నారు. వారి పని వేరు అయినా, వారు ఒకరికోసం మరొకరు సమయం కేటాయిస్తూనే ఉంటారు. ఎవరైనా సరే దంపతులు ఎంతగా కలిసి ఉంటారో, ఆ బంధం అంత బలపడుతుంది.

 

ప్రశంసలు..

ప్రేమించేటప్పుడు భాగస్వామిని పొగిడేవాళ్లు పెళ్లి తర్వాత అలా చేయరు అది పూర్తిగా తప్పు. విరాట్, అనుష్క సోషల్ మీడియా పోస్ట్‌లను పరిశీలిస్తే,  ఈ ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసించుకుంటారు. వారిని చూసి, మీరు మీ భాగస్వసామిని ఎలా ప్రేమించాలో, ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలుసుకోవచ్చు.

కలిసి ప్రయాణం చేయండి

మీ బిజీ లైఫ్ స్టైల్ నుండి కొంత సమయాన్ని వెచ్చించండి. మీ భాగస్వామితో విహారయాత్రను ప్లాన్ చేయండి. విరాట్, అనుష్క తరచుగా ట్రావెల్ పోస్ట్‌లను పంచుకుంటారు, వీటిని అభిమానులు ఇష్టపడతారు.

 

ప్రపంచం గురించి ఆలోచించవద్దు

ఒకప్పుడు వీళ్లిద్దరి బ్రేకప్ న్యూస్ చాలా చర్చనీయాంశమైంది, కానీ ఏమీ జరగలేదు, కాబట్టి ప్రపంచం ఏది చెప్పినా మన సంబంధాన్ని పాడు చేసుకోకూడదని విరాట్ , అనుష్కలను చూసి నేర్చుకోవాలి.

 

కెరీర్‌కు మద్దతు ఇవ్వండి

అనుష్క , విరాట్  పని రంగాలు భిన్నంగా ఉంటాయి, అయితే ఈ ఇద్దరూ ఒకరికొకరు మద్దతు , ప్రోత్సాహాన్ని కలిగి ఉన్నారు. నిజమైన సంబంధానికి ఇది అవసరం.

 

ప్రేమను కోల్పోవద్దు

పెళ్లి తర్వాత అబ్బాయిల ప్రేమ తక్కువ అని తరచుగా చెబుతుంటారు, కానీ ఇది నిజం కాదు. ఒక వ్యక్తి ప్రేమ నిజమైతే ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గదు. మీరు దీన్ని అనుష్క, విరాట్ జోడి నుండి నేర్చుకోవచ్చు. పెళ్లయి ఇన్ని సంవత్సరాలు గడిచినా వారి ప్రేమ మాత్రం తగ్గలేదు.

 

కేరింగ్...

మీ భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అనుష్క , విరాట్  సోషల్ మీడియా పోస్ట్‌లలో, మీరు ఒకరిపై మరొకరు ఎంత కేరింగ్ చూపిస్తారో అర్థమౌతుంది. మీరు కూడా అలా ఒకరిపై మరొకరు కేరింగ్ చూపించుకోవడం అవసరం.

2023-11-20T10:55:12Z dg43tfdfdgfd