వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..

తెలుగు రాష్ట్రాల్లో  కార్తీక పౌర్ణమి మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి.   2023, నవంబర్ 20వ తేదీ మొదటి కార్తీక సోమవారం వేములవాడ రాజన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయం ముందు కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. దీంతో స్వామివారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.

 స్వామి వారికి  అర్చకులు.. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.  భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని విశ్వేశ్వర స్వామి దేవాలయంలోనూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఇక, భద్రాచలం,  శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ వంటి తదిత ప్రాంతాల్లోని దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. 

©️ VIL Media Pvt Ltd.

2023-11-20T04:06:28Z dg43tfdfdgfd