షార్ట్ బ్రేక్ తీసుకున్న సమంత అమ్మతో పాటు అలా..!

సమంత రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండకు జంటగా నటించిన ఖుషి షూట్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కి ఖుషి సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ 1న ఖుషి విడుదల నేపథ్యంలో యూనిట్ సిద్ధం అవుతున్నారు. ఒక ప్రక్క ప్రొమోషన్స్ షురూ చేశారు. సాంగ్స్ విడుదల చేస్తున్నారు. చాలా కాలం తర్వాత సమంత రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. 

అలాగే సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. లేటెస్ట్ షెడ్యూల్ ముంబైలో కంప్లీట్ చేశారు. సహ నటుడు వరుణ్ ధావన్, సమంత మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. స్వల్ప విరామం దొరికిన నేపథ్యంలో సమంత ఫ్యామిలీకి సమయం కేటాయించారు. ఆమె తల్లితో పాటు డిన్నర్ నైట్ కి వెళ్లారు. సమంత లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ట్రెండీ వేర్లో సమంత తనకు ఇష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. 

కాగా సమంత బ్యాక్ టు బ్యాక్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు విడుదల చేసింది. యశోద, శాకుంతలం చిత్రాలతో ఆమె ప్రేక్షకులను పలకరించారు. యశోద విజయం సాధించగా శాకుంతలం మాత్రం భారీ షాక్ ఇచ్చింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన పౌరాణిక చిత్రం శాకుంతలం సమంత కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సమంత ఈ చిత్ర ఫెయిల్యూర్ పై స్వయంగా స్పందించడం విశేషం. ప్రయత్నం చేయడం వరకే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం కాదు అని అర్థం వచ్చే భగవద్గీత శ్లోకం పోస్ట్ చేసింది. 

2023-05-26T11:30:50Z dg43tfdfdgfd