సుడిగాలి సుధీర్ `సాఫ్ట్ వేర్ సుధీర్`, `గాలోడు` చిత్రాలతో అలరించారు. ఇప్పుడు `కాలింగ్ సహస్త్ర` చిత్రంతో వస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా, మర్డర్ మిస్టరీగా ఈ మూవీ రూపొందింది. అరుణ్ విక్కిరాలా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మంగళవారం సాయంత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. ఇందులో సుడిగాలి సుధీర్‌కి వరుసగా సహస్త్ర అనే అమ్మాయి కోసం ఫోన్స్ వస్తుంటాయి. ఎవరీ సహస్త్ర అని వెతికే పనిలో కొన్ని ఆసక్తికర, భయానక విషయాలు తెలుస్తాయిసుధీర్‌కి.
దీని వెనుకాల ఓ వ్యక్తి ఉన్నాడని, అతను వరుసగా హత్యలకు పాల్పడుతున్నాడని తెలుస్తుంది. మరి దాన్ని సుధీర్ ఎలా అడ్డుకున్నాడు, హంతకుడిని ఎలా ఎదురించాడనేది కథాంశంతో రూపొందిందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇందులో `భయం లో ఉన్నాడోకి బాధుండదు, బాధలో ఉన్నడోకి భయముండదు` అని సుధీర్ చెప్పే డైలాగ్ అదిరిపోయేలా ఉంది. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు టచ్ చేయని అంశాన్ని ఇందులో చూపిస్తున్నట్టు చిత్ర బృందం చెప్పింది. తనకు ఇదొక డిఫరెంట్ మూవీ అవుతుందని హీరో సుడిగాలి సుధీర్ తెలిపారు. ఇందులో ఆయనకు జోడీగా డాలీషా హీరోయిన్‌గా నటించింది. షౠడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది యూనిట్. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సుధీర్ మాట్లాడుతూ, ‘నేను ఈ కథను `సాఫ్ట్ వేర్ సుధీర్` కంటే ముందే విన్నాను. `గాలోడు`, ఈ చిత్రం రెండూ ఒకేసారి ప్రారంభించాం. `గాలోడు` హిట్ అయింది. మాస్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో రాబోతోన్నాను. ఈ జానర్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకోవాలని అనుకుంటున్నాను. వీలున్నప్పుడు, టైం దొరికినప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తాను. మార్క్ కే రాబిన్, గ్యారీ గారు రావడంలో మా సినిమా స్థాయి పెరిగింది. డిసెంబర్ 1న మా చిత్రం రాబోతోంది. అందరూ సినిమాను చూడండి. కొత్తగా ప్రయత్నిస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. సినిమా చూసి నచ్చితే ఓ పది మందికి చెప్పండి’ అని అన్నారు.
దర్శకుడు అరుణ్ విక్కిరాలా మాట్లాడుతూ, `ఈ కథ రాసుకున్నప్పుడు నేను ఓ హీరోని దృష్టిలో పెట్టుకుని రాయలేదు. నా కథ సుధీర్ వల్ల చాలా మందికి వెళ్తుందని అనుకుని తీసుకున్నాను. హాలీవుడ్‌లా ఉందని.. నాకు కథ చెబుతున్నారు.. నేనేనా హీరోని? అని సుధీర్ అన్నారు. సుధీర్ గారు ఏ సినిమాను అంగీకరించక ముందే ఈ కథను ఓకే చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి కథతో ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు. నా టీం సహకరించడం వల్లే సినిమా బాగా వచ్చింది. మార్క్ కే రాబిన్ ఆర్ఆర్, సన్నీ కెమెరాపనితనం, మోహిత్ పాటలు అన్నీ అద్భుతంగా ఉంటాయ`న్నారు. నిర్మాత విజేష్ తయాల్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు అద్భుతంగా తీశారు. సుధీర్ గారి గురించి చెప్పేందుకు మాటలు చాలవు. మీడియానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలి’ అని కోరారు. ఈ సినిమాని బెక్కం వేణుగోపాల్ విడుదల చేస్తున్నారు.
Read more: `జబర్దస్త్` రష్మితో పెళ్లి.. అమ్మాయిల హార్ట్ బ్రేక్ అయ్యే స్టేట్‌మెంట్ ఇచ్చిన సుడిగాలి సుధీర్..
2023-11-21T17:27:21Z dg43tfdfdgfd