హైదరాబాద్ కోకాపేటలో పుష్ప 2 షూటింగ్ సెట్

హైదరాబాద్ కోకాపేటలో పుష్ప 2 షూటింగ్ సెట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్(Pushpa the rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ అయ్యి అంచనాలు అమాంతం పెంచేశాయి. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ప్రసెంట్ పుష్ప ది రూల్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఐకానిక్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది, ఇక్కడ పుష్ప మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గంగమ్మ జాతర సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పుష్ప టీమ్..రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సీక్వెన్స్‌ తో పాటు ఒక సాంగ్ షూట్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్రొడక్షన్ యూనిట్ కోకాపేట్‌లోని అల్లు స్టూడియోస్‌ లో ఒక అద్భుతమైన సెట్ వేసినట్లు సమాచారం. ఇక్కడ చిత్రీకరించబోయే సీన్స్ చాలా ఇంటెన్స్ పెంచేలా సుక్కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

 పుష్ప ది రూల్ ఎలా ఉండబోతుంది..

పుష్ప ద రైజ్(Pushpa The Rise) ఫస్ట్ పార్ట్ మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన టైమ్ చూపిస్తే..ఇక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నారని సమాచారం. పుష్ప ఫారెన్ కంట్రీస్ లో కూడా తన హవా ఎలా నడిపించాడో అన్నది చూపించబోతున్నారట సుకుమార్. ఇప్పటికే పుష్పలో మారేడ్ మిల్లి, డీప్ ఫారెస్ట్ ఇంటెన్స్ విజువల్స్ తో సినిమా షూటింగ్స్ చేసి..ఇంటెన్సిటీ చూపించిన సుకుమార్..ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కూడా మారేడుమిల్లి అడవుల్లో ఇంకాస్త డెప్త్ తో చూపించబోతున్నారట. మొన్నటిదాకా వైజాగ్, రామోజీ ఫిలింసిటీలలో పుష్ప 2 షూట్ చేసిన టీం ప్రస్తుతానికి కోకాపేటలో అడుగుపెట్టబోతున్నాడు. పుష్ప ది రూల్ ఆగస్టు 15, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

©️ VIL Media Pvt Ltd.

2023-11-21T06:23:30Z dg43tfdfdgfd