హైదరాబాద్కు సరికొత్త అందం.. మంత్రి కేటీఆర్ ట్వీట్..
అందమైన భాగ్యనగరానికి సరికొత్త అందం జోడైంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టూ టూరిస్ట్ సర్క్యూట్‌గా చేయడం కోసం హెచ్‌ఎండీఏ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ అమరవీరుల స్థూపం, కొత్త సెక్రటేరియట్, భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో సాగర్ అందాలు రెట్టింపయ్యాయి. వీటికి అదనంగా మరొ స్పెషల్ అట్రాక్షన్ యాడ్ కాబోతుంది. జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో లేక్ ఫ్రంట్ పార్క్‌ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది.
హైదరాబాద్‌కు లేక్ ఫ్రంట్ పార్కు సరికొత్త అందం అన్నారు మంత్రి కేటీఆర్. సెంట్రల్ హైదరాబాద్ కు సరికొత్త అందాన్ని జోడించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ సరస్సు చుట్టూ జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో అందమైన లేక్ ఫ్రంట్ పార్కును HMDA అభివృద్ధి చేసింది. మరికొద్ది రోజుల్లో ఈ పార్కును ప్రారంభించనున్నాం. మీరందరూ అందమైన బోర్డు వాక్ ని సందర్శించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో లేక్ ఫ్రంట్ పార్కు వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
జలవిహార్ పక్కన 10 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఈ లేక్ ఫ్రంట్ పార్కును ఏర్పాటు చేసింది. దాదాపు రూ. 15 అంచనా వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేసింది. పార్కులో అండర్‌పాస్‌లతో కూడిన ఎత్తైన నడక మార్గాలు, కాలినడక దారులు, సీటింగ్‌తో కూడిన వాటర్ ఛానల్ డెక్, హుస్సేన్ సాగర్‌పై విస్తరించి ఉన్న గ్లాస్ డెక్, లేక్‌ఫ్రంట్ పార్క్ కోసం వేవ్ లాంటి కర్విలినియర్ డిజైన్‌లు ఏర్పాటు చేశారు. పార్కులో ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే పార్కులో పిల్లల కోసం ఆట స్థలం, సీటింగ్‌తో కూడిన పెర్గోలాస్ ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ కిషోర్ డి ప్రదాన్ ఈ పార్క్ అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టారు.
©️ VIL Media Pvt Ltd. 2023-09-19T06:27:22Z dg43tfdfdgfd