మెగాస్టార్‌తో తమన్నా, కీర్తి సురేష్ సాంగ్ షూట్.. దద్దరిల్లిన డాన్స్ ఫ్లోర్!

Bhola Shankar Song Shoot: ‘వాల్తేర్ వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’ (Bhola Shankar). తమన్నా భాటియా (Tamannah Bhatia) కథానాయిక కాగా.. కీర్తి సురేష్ (Keerthy Suresh) సిస్టర్ రోల్‌లో నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రానికి మెహర రమేష్ (Meher Ramesh) దర్శకుడు. ఆగస్టులో రిలీజ్ కానుండగా, ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది మూవీ టీమ్. ఈ మేరకు రీసెంట్‌గా మొదటి పాట భోలా మానియాను రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం చిరంజీవి, తమన్నా, కీర్తి ఇతర నటీనటులపై ఓ పాట చిత్రీకరిస్తు్న్నారు (Song Shoot with Megastar). కాగా చిరుతో పాటు ఇద్దరు హీరోయిన్ల స్టెప్స్‌తో డాన్స్ ఫ్లోర్‌ దద్దరిల్లింది.

‘భోళా శంకర్’ మూవీ చిత్రీకరణం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఒక సాంగ్ చిత్రీకరణం కోసం హైదరాబాద్‌లోనే మాసీవ్ సెట్‌ ఏర్పాటు చేశారు మేకర్స్. ఇక మొదటిసారిగా మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్ చేసే చాన్స్ దక్కించుకున్న మహతి స్వర సాగర్.. ఫుట్ టాపింగ్ మాస్ నంబర్‌‌తో జోష్‌ఫుల్ సాంగ్స్ ఇచ్చాడు. ఇక భారీ సెట్‌లో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ , ఇతర నటీనటులందరిపై ఈ డ్యాన్స్ నెంబర్‌ను చిత్రీకరిస్తున్నారు. కాగా.. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తుండటం విశేషం.

కోలీవుడ్‌లో అజిత్ నటించిన ‘వేదాళం’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘భోళా శంకర్’ తెరకెక్కుతోంది. స్టార్ కాస్టింగ్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఇంపార్టెంట్ రోల్‌‌లో కనిపించనున్నాడు. ఇక సత్యానంద్ స్టోరీ సూపర్‌విజన్ చేస్తుండగా.. తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వరిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. డుడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

100829675

ఈ చిత్రానికి రామ్ - లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ ఫైట్ మాస్టర్లు. కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, సిరాశ్రీ లిరిక్స్ అందించారు. ఇక ఈ చిత్రంలో రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖ వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ తదితరులు నటిస్తున్నారు.

Read latest Tollywood updates and Telugu News

2023-06-07T17:19:09Z dg43tfdfdgfd