హైద్రాబాద్ లో కాల్ మనీ తరహా వేధింపులు:యువతి ప్రైవేట్ వీడియోలు స్నేహితులకు పంపిన నిందితుడు

హైద్రాబాద్ లో  కాల్ మనీ తరహ ఘటన వెలుగు చూసింది. యువతితో ఏకాంతంగా  ఉన్న దృశ్యాలను  స్నేహితులకు పంపాడు  నిందితుడు.  ఈ విషయమై  బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

 హైద్రాబాద్ నగరంంలో కాల్ మనీ  తరహా మోసం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో   పరిచయం  ఈ దారుణానికి కారణమైంది. 

loveహైద్రాబాద్ కు చెందిన యువతికి  ఇన్‌స్టాగ్రామ్ లో చెన్నైకి చెందిన పూర్ణేష్ యాదవ్ పరిచయమయ్యాడు. వీరిద్దరూ  తరుచుగా చాటింగ్ చేసుకొనేవారు. వీరిద్దరి మధ్య  పరిచయం ప్రేమగా మారింది.

అయితే  పూర్ణేష్ యాదవ్ యువతిని  కొన్ని డబ్బులు అడిగాడు. అయితే ఆమె  తన వద్ద డబ్బులు లేవని  చెప్పింది.  అయితే  తనకు  తెలిసిన స్నేహితుడిని  ఇన్ స్టా గ్రామ్ లో  డబ్బులను  యువతి అడిగింది . అయితే  ఓ రాత్రి తనతో గడిపితే   డబ్బులు ఇచ్చేందుకు  అతను ఒప్పుకున్నాడు. దీంతో యువతి  అతనితో  హోటల్ లో గడిపింది.

అయితే  తనతో యువతి సన్నిహితంగా  ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా వీడియోలు రికార్డు  చేశాడు.  ఆ వీడియోలను తన స్నేహితులకు కూడా పంపాడు  నిందితుడు.  

అయితే  ఈ వీడియోలను నిందితుడి స్నేహితులు కూడ  యువతికి పంపారు.  నిందితుడి స్నేహితులు కూడ  యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.  ఈ విషయమై బాధితురాలు  హైద్రాబాద్ షీ టీమ్స్ ను ఫిర్యాదు  చేసింది.  ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన సీ టీమ్స్  టీమ్  కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసింది. నారాయణగూడ పోలీసులు,   పూర్ణేష్ యాదవ్ , అస్లాం, సాయి చరణ్ లకు  నోటీసులు  ఇవ్వనున్నారు. 

2023-06-08T07:36:03Z dg43tfdfdgfd