తిన్నా, పడుకున్నా సుధీర్ గురించే.. ఇన్‌డైరెక్ట్‌గా నాకు ఫ్యామిలీ దొరికింది: హీరోయిన్

బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). కొన్నేళ్లుగా తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సుధీర్.. ఇప్పుడు హీరోగానూ రెండు మూడు సినిమాలు చేశాడు. వాటి ఫలితం సంగతి పక్కనపెడితే.. సుధీర్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు. ప్రస్తుతం సుధీర్, శివ బాలాజీ, డోలిషా (Dollysha), స్పందన పల్లి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కాలింగ్ సహస్ర’ (Calling Sahasra). తాజాగా ఈ మూవీలోని ‘కలయా నిజమా’ సాంగ్ లాంచ్ (Kalaya Nijama Song Launch) ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా.. తిన్నా, పడుకున్నా సుధీర్ గురించే అంటూ సుధీర్‌పై హీరోయిన్ డోలిషా చేసిన కామెంట్స్ (Dollysha Comments on Sudheer) వైరల్ అవుతున్నాయి.

‘నేను ఇన్‌స్టాగ్రామ్‌లో షాపింగ్‌ పోస్ట్ పెడితే, సెలూన్‌కు వెళ్తే, నేను తింటే కూడా సుధీర్ గారి గురించి చెప్పండి అంటున్నారు. నేను రెస్టారెంట్‌కు వెళ్లి తింటున్నప్పుడు సుధీర్ గారు ఎక్కడ ఉన్నారో నాకెలా తెలుస్తుంది. పోనీ ఆయనకు ఫోన్ చేస్తే పికప్ చేస్తలేరు. మెసేజ్ చేస్తే రిప్లయ్ ఇస్తలేరు. మరి మీ సుధీర్ ఏం చేస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది. మదర్స్ డే రోజున మా మమ్మీ గురించి పోస్టు పెడితే.. ‘కాలింగ్ సహస్ర’ అప్‌డేట్ చెప్పాలని కామెంట్ చేస్తున్నారు. వాటన్నింటికీ ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నా. ఆ మెసేజ్‌లన్నింటికీ ఇదే రిప్లయ్. అలాగే ఇది ‘కాలింగ్ సహస్ర’ అప్‌డేట్. యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను చూడండి. నచ్చితే షేర్ చేయండి’ అని చెప్పింది.

ఇంకా సుధీర్ ఫ్యాన్స్ గురించి కంటిన్యూ చేస్తూ.. ‘ఏదైనా స్టోరీ పెడితే సుధీర్ అన్న గురించి ఒక్క వర్డ్ అని అడుగుతున్నారు. నేను తనతో పనిచేశా కాబట్టి ఆయన గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఒక్క వర్డ్ కాదు. మూడు నాలుగు పేజీల ఎస్సే పెట్టినా తక్కువే. చెప్పాలంటే ‘డౌన్ టు ఎర్త్, జెన్యూన్, స్వీట్ హార్ట్, ది మోస్ట్ హెల్పింగ్ పర్సన్.. ఇలా ఎస్సేనే ఉంది. మీరు చూడాలనుకుంటే ప్లీజ్ రండి.. ఎస్సే చూపిస్తా’ అని వెల్లడించింది డోలిషా.

ఇక సుధీర్ గారితో ఈ రోల్ చేసినందుకు నాకు థాంక్స్ చెప్తు్న్నారు. మీ అందరూ సుధీర్ గారికి డెడికేటెడ్, ట్రూ అండ్ ప్యూర్ ఫ్యాన్స్‌గా ఉన్నందుకు నేను మీకు ఫ్యాన్ అయ్యా. ఎందుకంటే ఇన్నేళ్లపాటు ఫ్యాన్స్ ఇంత డెడికేటెడ్‌గా ఉండటం చిన్న విషయం కాదు. నేను కూడా కొంతమంది స్టార్స్‌కు ఫ్యాన్‌నే. కానీ వాళ్ల సినిమా రాలేదంటే వదిలేస్తా. కానీ మీరు మాత్రం వదల్లేదు. దీనికోసమే నేను మీకు ఫ్యాన్ అయ్యా. ప్రతిరోజు సుధీర్ అన్న ఏం చేస్తు్న్నారు? అని అడిగితే మాత్రం నాకు తెలియదు, నన్ను అడగొద్దు. అలాగే మీరు సుధీర్‌ గారి ఫ్యాన్స్‌గా ఉన్నందుకు నాకు కూడా ఇండైరెక్ట్‌గా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ దొరికింది. సో.. ఇన్‌డైరెక్ట్‌గా నాపై లవ్ చూపినందుకు, సపోర్ట్ చేసినందుకు థాంక్యూ సో మచ్’ అంటూ ముగించింది.

Read latest Tollywood updates and Telugu News

2023-06-08T13:19:28Z dg43tfdfdgfd