మళ్లీ సౌత్‌‌లో..

మళ్లీ సౌత్‌‌లో..

క్యారెక్టర్ డిమాండ్ చేయాలేకానీ ఎలాంటి బోల్డ్ క్యారెక్టర్‌‌‌‌ చేసేందుకైనా రెడీ అంటుంది రాధికా ఆప్టే. ఇప్పటికే అలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చేసింది కూడా. ‘రక్తచరిత్ర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. బాలకృష్ణకు జంటగా లెజెండ్, లయన్ చిత్రాలతో పాటు కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆమె తెలుగులో సినిమా చేసి ఎనిమిదేళ్లు అవుతోంది. మళ్లీ ఇప్పుడు ఇక్కడ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. సౌత్ ఇండియన్ సినిమాలు చేయడానికి నేనెప్పుడూ రెడీగానే ఉన్నాను’ అని చెప్పింది.

ఇక విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కుతున్న ‘మెరీ క్రిస్మస్‌‌’  చిత్రంలోనూ ఆమె నటించబోతోంది. ఈ మూవీ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ తీసిన బద్లాపూర్, అంధాదూన్ చిత్రాల్లో రాధిక నటించింది. ఆ రిలేషన్‌‌తోనే ఇందులో రాధికా ఆప్టే కేమియో రోల్ చేయబోతోందట. కథను మలుపుతిప్పే ఇంపార్టెంట్‌‌ క్యారెక్టర్ ఆమె పోషిస్తోందని తెలుస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ సినిమా తర్వాత మళ్లీ రాధికా ఆప్టే సౌత్‌‌కు దగ్గరవుతుందేమో చూడాలి!

©️ VIL Media Pvt Ltd.

2023-06-08T04:03:58Z dg43tfdfdgfd