ఆగస్టులో అర్జునుడు వస్తున్నాడు

ఆగస్టులో అర్జునుడు వస్తున్నాడు

డిఫరెంట్ జానర్స్‌‌ టచ్ చేస్తూ, హీరోగా టాలీవుడ్‌‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం ‘గాంఢీవధారి అర్జున’ అనే యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకుడు. శ్రీ వెంక‌‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌‌ర్‌‌పై బి.వి.ఎస్‌‌.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌‌‌‌, బీటీఎస్‌‌ వీడియో గ్లింప్స్‌‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

బుధవారం మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ను ప్రకటించారు. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారు. మిక్కి జె.మేయ‌‌ర్ సంగీతం అందిస్తుండగా ముఖేష్ సినిమాటోగ్రాఫర్. వరుణ్ తేజ్ ఇంటెన్స్ క్యారెక్టర్‌‌‌‌లో నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి, యాక్షన్ సీక్వెన్సులు హైలైట్‌‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2023-06-08T04:03:58Z dg43tfdfdgfd