ఊచకోత షురూ... భగవంత్ కేసరిగా బాలయ్య, 108 మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్..

బాలయ్య ఫ్యాన్స్ కు పండగానే.. వరుస సినిమాలతో దూసుకుపోతూ.. కుర్ర హీరోలకు కూడా పోటీ ఇస్తూ వస్తున్న బాలయ్య.. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో 108 వ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈమూవీ టైటిల్ ను రిలీజ్ చేశారు టీమ్. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు అనిల్ టీమ్. బాలయ్య సినిమాకు భగవంత్ కేసరి టైటిల్ ను ప్రకటిస్తూ.. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్.  అంతే కాదు ఈ టైటిల్ కు ఐ డోంట్ కేర్ అనే క్యాప్షన్ ను కూడా రివిల్ చేశారు టీమ్. 

ఇక  10న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా... రెండు రోజుల ముందు టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు టీమ్. అంతే కాదు ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ తో ఓ రికార్డ్ కూడా క్రియయేట్ చేశారు బాలయ్య, అనిల్ రావిపూడి టీమ్. ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య 108 మూవీ కాబట్టి.. 108 లొకేషన్లలో.. 108 హోర్టింగ్స్ మీద ఈ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. గతంలో ఎన్నడు లేని విధంగా బాలయ్య కోసం కోత్తగా ట్రై చేశారు. 

అంతే కాదు బాలకృష్ణ అభిమానులకోసం ఈమూవీ డైరెక్టర్  అనిల్ రావిపూడి మరో సర్ ప్రైజ్ గిఫ్ట్ ను కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది. పుట్టిన రోజుకు రెండు రోజుల ముందు ఇలా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. బాలయ్య బర్త్ డే అయిన జూన్ 10న భగవంత్ కేసరి స్పెషల్ టీజర్ ను బాలయ్య బర్త్ డే  కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను  విజయ దశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా  థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు 

 షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి  ఈసినిమాను  నిర్మిస్తున్నారు.  భగవంత్ కేసరి'లో బాలకృష్ణ జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.  ఈ ఇద్దరికాంబోలో సినిమా రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఇక ఈమూవీలో యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. బాలయ్య సోదరుడిగా తమిళ స్టార్ శరత్ కుమార్ నటిస్తుండగా.. ఆయన కూతురుగా శ్రీలీల కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీలో  బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు.

బాలయ్య ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ కూడా రాబోతోంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన కూడా రానుంది. బాలయ్య హీరోగా మెగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమా ప్రకటనకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీఈ సినిమా చేయనున్నారు. ఆ సినిమాను జూన్ 10న ప్రకటించనున్నట్టు సమాచారం. . అనిల్ రావిపూడి సినిమా పూర్తయ్యాక ఆ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.

2023-06-08T04:20:32Z dg43tfdfdgfd