మరో చిన్నారిపై వీధి కుక్కల దాడి.. తీవ్ర గాయాలు

మరో చిన్నారిపై వీధి కుక్కల దాడి.. తీవ్ర గాయాలు

హైదరాబాద్ లో మరో చిన్నారి వీధి కుక్కల బారిన పడింది. పటాన్ చెరు పట్టణంలోనీ మార్కెట్ లో మాహీర (6) అనే బాలిక పై వీధి కుక్కల దాడి చేశాయి. చిన్నారి గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చి కుక్కలను తరిమివేశారు. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలైయ్యాయి.

కుక్కల దాడి చేయడంతో మహీర తల, వీపుపై గాయాలైయ్యాయి. గాయపడిన బాలికను వెంటనే ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రి తరలించారు వైద్యులు. 

రాష్ట్రాంలో ప్రతిరోజూ వీధి కుక్కలు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు కనిపిస్తే చాలు ఎగబడి కరుస్తున్నాయి. ఆ సమయంలో పెద్దవాళ్లు వెళ్లి రక్షిస్తున్నారు. వాహనాలపై వెళ్తున్నవారిపై కూడా కుక్కలు దాడులు చేయడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో కొంతమంది భయంతో కిందపడి గాయాలుపాలవుతున్నారు. 

చిన్నపిల్లలు, పెద్దవారు, వృద్ధులపై తరచూ కుక్కలు దాడి చేస్తున్నప్పటికీ జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వాటిని తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2023-05-28T07:14:51Z dg43tfdfdgfd