ఉరుకుల పరుగుల ముంబై నగరంలో విజయ్ సేతుపతి - ట్రైలర్ చూశారా?

తమిళ ప్రముఖ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన తొలి హిందీ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది అయితే. ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. విజయ్ సేతుపతి నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ 'ముంబై కర్'. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేద్దామని మేకర్స్ ముందుగా అనుకున్నారట. కానీ తాజా సమాచారం ప్రకారం థియేటర్స్ లో కాకుండా నేరుగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో విడుదల కాబోతోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించడమే కాకుండా తాజాగా ట్రైలర్ ని కూడా విడుదల చేసింది. ఇక ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో విజయసేతుపతి ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు. ఇందులో ఓ చిన్న పిల్లవాడిని అతడు కిడ్నాప్ చేస్తాడు. ఆ చిన్న పిల్లవాడు ముంబై డాన్ కొడుకు కావడం పెద్ద ట్విస్ట్.

నిజానికి వేరే పిల్లవాడిని కిడ్నాప్ చేయబోయి ఈ డాన్ కొడుకుని కిడ్నాప్ చేస్తాడు విజయ్ సేతుపతి. ఇక ట్రైలర్ మొత్తం ఆ కిడ్నాప్ చుట్టే తిరిగింది. ఇక ఈ ట్రైలర్ లో విజయ్ సేతుపతి హిందీ మాట్లాడే విధానం కూడా నవ్వు తెప్పిస్తుంది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి తో పాటు విక్రాంత్ మస్సీ, తాన్యా మాణిక్‌తలా, రాఘవ్ బిర్నానీ, సచిన్ ఖేడేర్కర్  తదితరులు ఇతర కీలక పాత్రలో నటించారు. కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ ఈ మూవీకి స్క్రిప్ట్ అందించడం విశేషం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 'ముంబైకర్' అనే సినిమా కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గతంలో తెరకెక్కించిన 'మానగరం' సినిమాకి రీమేగా తెరకెక్కింది.  సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ప్రధాన పాత్రలు పోషించిన 'మానగరం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని అందుకుంది. తెలుగులో కూడా 'నగరం' అనే పేరుతో ఈ సినిమా డబ్ అయింది. ఇక ఇదే సినిమాని చిన్న చిన్న మార్పులతో 'ముంబై కర్' అనే పేరుతో హిందీలో తెరకెక్కించారు.

Also Read : ఎన్టీఆర్‌ను దేవుడిగా ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

ప్రముఖ ఛాయగ్రాహకుడు సంతోష్ శివన్ ఈ మూవీ ని డైరెక్ట్ చేశారు. జూన్ 2న జియో సినిమా ఓటీటీలో ఈ మూవీ ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. హిందీ తో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఇక ఇటీవల బాలీవుడ్ లో 'ఫర్జీ' అనే వెబ్ సిరీస్ తో హిందీలో ఎంట్రీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డికె ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించగా.. బాలీవుడ్ అగ్ర హీరో షాహిద్ కపూర్ లీడ్ రోల్ ప్లే చేశాడు. విజయ్ సేతుపతి ఈ వెబ్ సిరీస్లో ఇంటలిజెన్స్ ఆఫీసర్గా తన విలక్షణ నటనతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. త్వరలో ఈ వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా సీజన్ 2 కూడా రాబోతోంది. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ లోనే రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అందులో ఒకటి షారుక్ ఖాన్ - అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న 'జవాన్' కాగా మరొకటి కత్రినా కైఫ్ తో కలిసి నటిస్తున్న 'మేరీ క్రిస్మస్' ప్రస్తుతం ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Also Read : నిఖిల్ హీరోగా రామ్ చరణ్ సమర్పించు 'ది ఇండియా హౌస్' - తగలబడిన ఇంటి మిస్టరీ ఏమిటో?

 

2023-05-28T06:56:02Z dg43tfdfdgfd