Ruturaj Gaikwad Wedding: చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడయ్యాడు. రెండేండ్లుగా ప్రేమిస్తున్న తన ప్రేయసిని రుతురాజ్ నిన్న రాత్రి వివాహం చేసుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, రెండేండ్లుగా ప్రేమలో ఉన్న మహారాష్ట్ర మహిళా జట్టు క్రికెటర్ ఉత్కర్ష పవార్‌తో శనివారం రాత్రి మహబలేశ్వర్‌లో రుతురాజ్ వివాహం ఘనంగా జరిగింది.
కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో రుతురాజ్.. ఉత్కర్షలు వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను రుతురాజ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.
పెళ్లి ఫోటోలను పంచుకుంటూ రుతురాజ్.. ‘పిచ్ నుంచి హోమగుండం దాకా మా ప్రయాణం మొదలైంది..’ అని రాసుకొచ్చాడు. రుతురాజ్ - ఉత్కర్షల పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పూణేకి చెందిన ఉత్కర్ష పవార్.. మహారాష్ట్ర తరుపున దేశవాళీ టోర్నీలు ఆడింది. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఉత్కర్ష, రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది. 11 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ పూ మక్కువ పెంచుకున్న ఉత్కర్ష.. ప్రస్తుతం ఆటకు బ్రేక్ ఇచ్చింది.
పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ సైనెన్స్‌లో చదువుకుంటోంది. కాగా ఈ నవదంపతులకు టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమిండియా ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ లు రుతురాజ్‌కు విషెస్ తెలిపారు.
ఇక రుతురాజ్ విషయానికొస్తే.. దేశవాళీలో అదరగొడుతున్న ఈ పూణే కుర్రాడిని 2020లో రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై. పెట్టింది రూ. 20 లక్షలే అయినా ఈ కుర్రాడు చెన్నై బ్యాటింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. 2021లో సీఎస్కే గెలుపులో రుతురాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆ ఏడాది ఆరెంజ్ క్యాప్ కూడా గెలిచాడు. ఈ సీజన్ లో కూడా రుతురాజ్.. 16 మ్యాచ్ లలు 15 ఇన్నింగ్స్ ఆడి 590 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.
2023-06-04T04:04:43Z dg43tfdfdgfd