60 యేళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న పోకిరి నటుడు ఆశిష్ విద్యార్ధి..

Ashish Vidyarthi Marriage: బాలీవుడ్‌తో పాటు తెలుగు సహా దక్షిణాది చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న ప్యాన్ ఇండియా నటుడు ఆశిష్ విద్యార్ధి.  ఈ రోజు అస్సామ్‌కు చెందిన రూపాలి బారువాను కోల్‌కతాలోని ఓ క్లబ్‌లో వివాహా మాడారు. ఆశిష్ విద్యార్ధి విషయానికొస్తే.. ‘కాల్ సంధ్య’ సినిమాతో నటుడిగా పరిచయ్యారు. ఆ తర్వాత గోవింద్ నిహ్లానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ద్రోహ్ కాల్’ సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈయన హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ కలిపి దాదాపు 11 భాషల్లో300 పైగా చిత్రాల్లో నటుడిగా సత్తా చాటారు. ముఖ్యంగా సినిమాల్లో క్రూరమైన విలనీకి ఇతను పెట్టింది పేరు. తెలుగులో మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ సినిమాలో క్రూరమైన మనస్తత్వం కలిగిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు.

ఆయన విలనిజంతో పోకిరిలో మహేష్ బాబు హీరోయిజం ఎలివేట్ అయింది. ఆశిష్ విద్యార్ధి గతంలో రాజోషి బారువాను మొదటి వివాహాం  చేసుకున్నాడు. ఈమె ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ కమ్ సింగర్. ఈమె అప్పటి బెంగాలి నటి శకుంతల బారువా కూతురు.వీళ్లకో కుమారుడు ఉన్నాడు. ఈమెకు  తాజాగా ఆశిష్ విద్యార్ది పెళ్లి చేసుకున్న రూపాలి బారువా అస్సామ్‌లోని గువాహతికి చెందింది. ఈమె ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈమెకు కోల్‌కతాలో ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నాయి.

గత కొంత కాలంగా ఆశిష్ విద్యార్ధి.. రూపాలి బారువాతో సన్నిహితంగా మెలుగుతున్నారు కోర్టు మ్యారేజ్ చేసుకున్న వీళ్ల పెళ్లికి కొంత మంది ఫ్యామిలీ మెంబర్స్ మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సాయంత్రం బంధుమిత్రులకు డిన్నర్ ఇవ్వనున్నట్టు ఆశిష్ విద్యార్ధి తెలిపారు. ఆయన 19 జూన్ 1962లో ఢిల్లీలో జన్మించారు. వీళ్ల నాన్న కేరళలోని కన్నూర్ ప్రాంతానికి చెందినవారు. అమ్మ బెంగాలీ. కానీ రాజస్థాన్‌లో సెటిలయ్యారు. వీళ్ల నాన్న గోవింద్ విద్యార్ధి ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్. సంగీత నాటక అకాడమీలో పనిచేసారు. తండ్రి ప్రభావంతో సినిమాల్లో ప్రవేశించి అనతి కాలంలో నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆశిష్ విద్యార్ది. రీసెంట్‌‌గా తెలుగులో ‘రైటర్ పద్మభూషణ్‌లో హీరో తండ్రి పాత్రలో నటించారు. మరోవైపు వెంకటేష్, రానా ముఖ్యపాత్రల్లో నటించిన ‘రానా నాయుడు’లో కూడా విలన్ పాత్రలో యాక్ట్ చేసాడు. ఇందులో ఈయన  పాత్రకు మంచి పేరొచ్చింది.

2023-05-25T10:11:51Z dg43tfdfdgfd