ADIPURSH PRE RELEASE: ఆధ్యాత్మిక కేంద్రంలో ఆదిపురుష్ హంగామా..? ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం తిరుపతిలోని తారకరామా స్టేడియంలో అట్టహాసంగా సాగనుంది. రామాయణం ఆధారంగా రూపొందిన చిత్రం కావడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ముందు పలు విమర్శలకు తావిచ్చిన.... అనంతరం ట్రైలర్ ద్వారా అభిమానులను., విమర్శకుల మన్ననలలు అందుకుంది చిత్ర బృందం. రామాయణం నేపధ్యంగా తీస్తున్న చిత్రం కావడంతో తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని చేపట్టాలని చిత్ర బృందం సంకల్పించింది.

గతంలో బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో సక్సెస్ కావడంతో అదే వేదికపై ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర బృందం చేయనుంది. ఇప్పటికే తారకరామా స్టేడియంలో భారీ ఏర్పాట్లను చేయనున్నారు. ఈ తరం వారిలో రామాయణాన్ని.... రామాయణం అతరార్ధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపేలా ఈ సినిమా ఉండనుందని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. గతంలో రాముడంటే.... ఎన్టీఆర్ ., శోభన్ బాబు వంటి మహా నటులు గుర్తుకు వచ్చేవారని.... ఆదిపురుష్ సినిమా అనంతరం ప్రభాస్ రామునిగా ప్రేక్షక దేవుళ్ళు భావిస్తారని అంటున్నారు.

ఈ కార్యక్రమాన్ని భారీ పోలీస్ బలగాల నడుమ నిర్వహించనున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు ఈ ఈవెంట్ కు బందోబస్తు కల్పించిననున్నారు. ఈ కార్యక్రమానికి ఆదిపురుష్ చిత్ర బృందం., యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్., నటి కృతి సనన్., త్రిదండి చిన్నజీయర్ స్వామి హాజరు అవ్వనున్నారు.

2023-06-05T18:31:09Z dg43tfdfdgfd