ALLU ARJUN: ఓవర్ యాక్షన్ చేయకుండా షూటింగ్‌కు వచ్చెయ్.. కేశవకు పుష్ప వార్నింగ్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించిన ‘పుష్ప’ (Pushpa) మూవీ ఓ రేంజ్‌లో సక్సె్స్ సాధించింది. ఈ చిత్రం అల్లు అర్జున్‌ (Allu Arjun) పాన్ ఇండియా స్టార్‌ అయిపోగా.. తన ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించిన జగదీష్‌ @ కేశవకు (Keshava) కూడా మంచి పేరొచ్చింది. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ (Pushpa 2) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు జగదీష్ ‘సత్తిగాని రెండెకరాలు’ (Sathi Gani Rendu Ekaralu) సినిమాలో హీరోగా నటించాడు. అభినవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శుక్రవారం (మే 26) నేరుగా ‘ఆహా’ ఓటీటీ (Aha OTT) ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఆహాలో ప్రసారమయ్యే ‘తెలుగు ఇండియన్ ఐడల్’ (Telugu Indian Idol) ఫినాలేకు హాజరయ్యాడు జగదీష్. అయితే, ఇదే షోకు అల్లు అర్జున్ గెస్ట్‌గా విచ్చేశాడు. దీంతో వీరిద్దరి మధ్యన జరిగిన సంభాషణ నెట్టిజన్లకు ఆసక్తి కలిగించింది. ఈ సందర్భంగానే బన్నీ.. జగదీష్‌కు స్వీట్ వార్నింగ్ (Allu Arjun Sweet Warning) ఇవ్వడం విశేషం.

ఈ సందర్భంగా కేశవ క్యారెక్టర్‌లో మాట్లాడిన జగదీష్.. ‘అన్నో.. పుష్పన్న! నాకో రెండెకరాలుండాయి. మీరు కొంటారేమోనని చెప్పి వొచ్చుండా ఈడికి’ అని బన్నీని అడిగాడు. అయితే దీనికి బన్నీ సైతం పుష్పరాజ్ స్టైల్‌లోనే సమాధానమిచ్చాడు. ‘గుర్తుపెట్టుకో! నువ్వు సత్తిగాడివి కాదు, కేశవనే ఎప్పటికైనా. నువ్వు త్వరగా సినిమా ప్రమోషన్స్ అవగొట్టుకునీ పుష్ప షూటింగ్‌కు రా! అక్కడ అందరూ వెయిటింగ్’ అని కౌంటర్ ఇచ్చాడు. దీంతో అట్నే పుష్పన్నా అని బదులిచ్చిన జగదీష్.. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అవుతోంది. మీకు కొంచెం చూసి కోఆపరేట్ చేయండని రిక్వెస్ట్ చేశాడు. తప్పకుండా చేస్తాను గానీ ఇంతకీ చూసిందా, చూడలేదా? అని పుష్ప డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్‌కు ‘చూడలేదు మచ్చా’ అని రిప్లయ్ ఇచ్చాడు కేశవ. ఇలా ఇద్దరి మధ్య కాసేపు ఫన్నీ చిట్ చాట్ జరిగింది.

చివరగా కేశవ హీరోగా నటించిన సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు అల్లు అర్జున్. అయితే, సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత నేను హీరో అయిపోయాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయనని ఓవర్ యాక్షన్ చేయకుండా మళ్లీ షూటింగ్‌కు వచ్చెయ్ అన్నాడు బన్నీ. అంతేకాదు ‘సర్ ఇప్పుడు ఆ సినిమా హిట్ అయ్యింది. ఇప్పుడు క్యారెక్టర్ చేస్తే బాగోదు. ఇలాంటిదేం లేదు కదా.. చంపేస్తా!’ అని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

100510443

ఇక అల్లు అర్జున్ అప్‌కమింగ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతానికి ‘పుష్ప2’ మాత్రమే సెట్స్‌పై ఉంది. రీసెంట్‌గా ఒక హిందీ ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్‌లో నాల్గో సినిమా ఉంబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Tollywood updates and Telugu News

2023-05-26T10:44:30Z dg43tfdfdgfd