ANATOMY OF A FALL: భర్త హత్య కేసులో భార్యే నిందితురాలైతే - క్షణక్షణం ఉత్కంఠ పెంచుతున్న కోర్టు డ్రామా, ఓటీటీలో ఈ మిస్టరీ డెత్‌ చూసి థ్రిల్‌ అవ్వండి

Anatomy of a Fall Movie Review in Telugu: ఓటీటీలు వచ్చాక మూవీ లవర్స్‌కి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అందుతుంది. ప్రతివారం డిఫరెంట్‌ డిఫరెంట్‌ జానర్‌ చిత్రాలు డిజిటల్‌ ప్రిమయర్స్‌కి వచ్చేస్తున్నాయి. అయితే పలు ఓటీటీల్లో మాత్రం బాగా ఆదరణ పొందుతున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యం సస్పెన్స్‌, క్రైం థ్రిల్లర్స్‌కు చిత్రాలకు ఫ్యాన్స్‌ ఎక్కువ. పలు ఓటీటీల్ల ఈ జానర్‌ చిత్రాలు బోలేడు ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువగా థ్రిల్‌ని ఇచ్చేవి మాత్రం కొన్నే ఉంటాయి. అందులో 'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్' ఒకటి. క్షణం క్షణం ఉత్కంఠని పెంచే ఈ సినిమా 2023లో విడుదలైంది. ఫ్రెంచ్‌‌ లీగల్‌ డ్రామా చిత్రంగా వచ్చిన 'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్' ఓటీటీలో ఎంతో ఆదరణ పొందుతుంది. అంతేకాదు ఆస్కార్‌తో పాటు వందకుపైగా అవార్డులు గెలుచుకుంది ఈ చిత్రం. ఇటీవల 96వ ఆస్కార్ ఆవార్డుల్లో అయితే విభాగాల్లో అకాడమీ అవార్డుకు నామినేట్‌ అయిన ఈ చిత్రం బెస్ట్‌ ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డును గెలుచుకుంది. ఇందులో లీడ్‌ యాక్టర్‌ అయినా సాండ్రా హుల్లర్ ఉత్తమ నటిగా అవార్డుకు ఎంపికైన త్రటిలో మిస్సయ్యింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఇటీవల అమెజాన్‌ ప్రైంలో ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు రిజనల్‌ భాషలైన తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది, క్రైం థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా డిజిటల్‌ ప్రియులు ఆకట్టుకుందా? లేదా చూద్దాం!

కథేంటంటే

అప్పుడప్పుడే రచయతగా ఎదుగుతున్న సాండ్రా వోయిటర్‌ (ప్రధాన పాత్ర సాండ్రా హల్లర్‌). ఆమె తన భర్త శామ్యూల్‌ (శామ్యూల్ థీస్), అంధుడైన తన కుమారుడు డెనియల్‌, స్నూప్‌ (పెంపుడు కుక్క)తో హిమలయాల్లో నివస్తుంది. రచయిత్రిగా గుర్తింపు పొందిన ఆమె జీవితంలో ఒక్కసారిగా అనుహ్యమైన మలుపు తిరుగుతుంది. ఒక రోజు ఆమె భర్త శామ్యూల్ అనుమానస్పదంగా మృతి చెందుతాడు. ఈ హత్య కేసులో అతడి భార్య సాండ్రా నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీంతో ఆమె తనని తాను నిర్ధోషిగా ఎలా నిరూపించుకుంది. ఎలా రక్షించుకుంది. హత్య కేసు నుంచి ఆమె ఎలా బయటపడింది. కేసు విచారణ సమయంలో ఎదుర్కొన్న పరిణామాలు, కోర్టులో ఎదురైన అవమానాలతో ప్రతి క్షణంగా ఉత్కంఠగా, సస్పెన్స్‌తో సాగింది ఈ కోర్డు డ్రామా. 

విశ్లేషణ

సాండ్రా హల్లర్‌ ఒక రచయిత. అప్పుడప్పుడే రచయితిగా ప్రపంచానికి పరిచయం అవుతుంది. ఆమె భర్త ప్రోఫెషర్‌. సాండ్రా తన భర్త శామ్యూల్‌తో పదేళ్ల కుమారుడు, స్నూప్‌ (పెంపుడు కుక్క) ఆమె భర్త తండ్రితో కలిసి హిమాలయాల్లో నివస్తుంది. ఆ చూట్టూ పక్కల కొంత దూరంలో వరకు  ఎవరూ ఉండరు. ఒక్క ఈ ఫ్యామిలీలో మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో రచయిత్ర ఎదుగుతున్న సాండ్రాను ఓ మీడియా సంస్థ ఇంటర్య్వూ చేస్తుంది. రచయితగా తన అనుభవాన్ని పంచుకుంటున్న సాండ్రా వైవాహిక జీవితం, భర్త గురించి చెప్పేందుకు పెద్దగా ఆసక్తి చూపదు. అయితే ఇంటర్య్వూ జరుగుతున్న సమయంలో బయట ఎవరో గట్టిగా అరిచిన శబ్ధం వినిపిస్తుంది. అదే సమయంలో అంధుడైన సాండ్రా పదేళ్ల కుమారుడు తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్‌ వెళతాడు. తిరిగి వస్తుండగా తన తండ్రి అక్కడ పడుకుని ఉండటాన్ని అతడి గ్రహిస్తాడు. అరుపుతో బయటకు వచ్చి చూడగా ఆమె భర్త శామ్యూల్‌ రక్తం మడుగులో కనిపిస్తాడు. అతడి తలపై ఎవరో కొట్టినట్టు గాయం ఉంటుంది. చూట్టూ పక్కల ఎవరూ లేకపోవడం, ఆ సమయంలో శాండ్రా తప్పు అక్కడ ఎవరు లేకపోవడంతో పోలీసులు ఆమెను అనుమానిస్తారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తూ కేసు నమోదు చేస్తారు. ఇక ఈ కేసులో సాండ్రా తప్ప సాక్ష్యులు ఎవరూ లేకపోవడంతో ఈ కేసు ఛేదించడం పోలీసులకు కష్టం అవుతుంది. దీంతో సాండ్రానే నిందితురాలు అని నమ్ముతున్న ఆమెను ప్రధాన హంతకురాలిగా చేస్తూ కేసు నమోదు చేస్తారు.

ఈ క్రమంలో విచారణలో, కోర్టులో సాండ్రా ఇచ్చే సమాధానాలు, ఆమె తీరు మరింత అనుమానాలకు దారి తీస్తాయి. కొన్ని సన్నివేశాలు ఆమె నిర్థోషిగా అనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఆమె దోషిగా కనిపిస్తుంది. ఇలా సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు డైలామాలో పడుతుంటాడు. ప్రతీ సీన్‌ల సస్పెన్స్‌తో ఉత్కంఠని పెంచుతుంది. చివరికి వరకు సాండ్రా వోయిటర్‌ పాత్ర అర్థం కానీ విధంగా మలిచాడు డైరెక్టర్‌ జస్టిన్ ట్రియెట్. కోర్డులో ఆమె విచారణ ఎదుర్కొంటున్న సమయంలో ఇచ్చిన సమాధానాలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి. చివరికి ఈ కేసులో సాండ్రా కుమారుడు డెనియల్‌ సాక్ష్యాంగా కీలకం అవుతుంది. ఆమె హంతకురాలు అని కేసు రుజువు అవుతున్న టైంలో ఆమె కుమారుడు డేనియల్‌ సాక్ష్యాం కథను ఊహించని మలుపు తిప్పుతుంది. డేనియల్‌ ఇచ్చిన సాక్ష్యాం ఏంటీ,  సాండ్రానే తన భర్తను హత్య చేసిందా? అదే నిజమైతే ఎందుకు  హత్య చేయాల్సి వచ్చింది? అనే సమధానాలు దొరకాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ లీగల్‌ డ్రామాను అమెజాన్‌ ప్రైంలో 'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్'ను తెలుగులో చూసి థ్రిల్‌ ఫీల్‌ అవ్వండి. 

2024-04-23T14:46:30Z dg43tfdfdgfd