APARNA DAS: మంజుమ్మల్ బాయ్స్ నటుడితో హీరోయిన్ పెళ్లి.. హల్దీ ఫొటోలు వైరల్

తమిళ హీరో విజయ్ 'బీస్ట్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ హీరోయిన్‌ అపర్ణ దాస్‌ ఏడడుగులు వేయనున్నారు. తన ప్రియుడైన నటుడు దీపక్‌ పరంబోల్‌‌తో ఏప్రిల్ 24న ఆమె వివాహం జరగబోతుంది. తాజాగా హల్దీ వేడుకలు నిర్వహించారు. ఆ ఫొటోలు, వీడియోలను అపర్ణ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెకు విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

మంజుమ్మల్ బాయ్స్

అపర్ణ ప్రియుడు దీపక్ పరంబోల్ ఇటీవల విడుదలైన 'మంజుమ్మ‌ల్ బాయ్స్‌' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో ఫ్రెండ్స్‌లో ఒకడిగా నటించాడు. ఇక అపర్ణ, దీపక్‌లు 'మనోహరం' అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి వివాహానికి కుటుంబసభ్యులు అంగీకరించడంతో ఫ్యాన్స్‌కి ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది ఈ జంట.

View this post on Instagram

A post shared by Wedding Photographer - Elementricx (@momentssbyelementricx)

]]>
ఇక కెరీర్ విషయానికొస్తే 2018లో 'న్యాన్‌ ప్రకాశన్‌' సినిమాతో అపర్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 'దాదా' సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక 2022లో వచ్చిన 'బీస్ట్‌' సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఇక తెలుగులో 'ఆదికేశవ' సినిమాలో కూడా ఓ చిన్న పాత్ర చేసింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T09:35:09Z dg43tfdfdgfd