BHAVANA: బతికుండగానే చంపేస్తున్నారు.. మహాత్మ హీరోయిన్ ఆవేదన

Bhavana: బతికుండగానే చంపేస్తున్నారు.. మహాత్మ హీరోయిన్ ఆవేదన

గోపీచంద్(Gopichand) హీరోగా వచ్చిన ఒంటరి(Ontari) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీరోయిన్ భావన(Bhavana). ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆమెకు వరుస అవకాశాలు దక్కలేదు. ఆ తరువాత కొంతకాలానికి శ్రీకాంత్ హీరోగా వచ్చిన మహాత్మతో మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. ఇక ఈ సినిమాలోని నీలపురి గాజుల ఓ నీలవేణి అనే పాట ఎంత పెద్ద విరాజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా మంచి విజయం సాదించినప్పటికే అవకాశాలు దక్కించుకోలేకపోయింది భావన. దాంతో పెళ్లి చేసుకొని సినిమాలకు దొరమైంది.

 

ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భావన తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. అంతేకాదు.. కొన్ని విషయాల గురించి క్లారిటీ ఇస్తూ ఎమోషనల్ అయ్యింది భావన. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. బతికుండగానే నేను చనిపోయానని వార్తలు రాస్తున్నారు. అవి చూసినప్పుడు చాలా బాధేసింది. నాకు నాలుగు సార్లు అబార్షన్ అయిందని, చాలా మందితో ఎఫైర్స్ పెట్టుకున్నానని, మొత్తంగా నన్ను ఒక తప్పుడు మనిషిగా సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను నా ఫ్యామిలీతో సంతోషంగా ఉంటున్నాను.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు భావన. ప్రస్తుతం ఆమె మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T11:01:21Z dg43tfdfdgfd