BIGG BOSS 7: రతిక- పల్లవి ప్రశాంత్ సీక్రెట్ వీడియో లీక్.. అందరూ పడుకున్నాక బెడ్ రూములో..!

ఈ సారి బిగ్ బాస్ సీజన్ (Bigg Boss 7 Telugu) ఉల్టా పుల్టా అని ముందే చెప్పారు కదా. సరిగ్గా హౌస్ లో అదే జరుగుతోంది. ఎవ్వరూ ఊహించని కొన్ని సీన్స్ చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, ఆట సందీప్, షకీలా, శోభా శెట్టి, టేస్టీ తేజ, రితిక రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ కూడా అయ్యారు. అయితే హౌస్ లో స్పెషల్ అట్రాక్షన్ అవుతున్న ఓ జోడీ ఏది అంటే పల్లవి ప్రశాంత్- రతిక రోజ్. తాజాగా ఈ ఇద్దరికి సంబంధించిన ఓ సీక్రెట్ వీడియో లీక్ చేశారు బిగ్ బాస్.

ఈ సీజన్ ప్రారంభం నుంచే రతిక (Rathika Rose) చుట్టే ప్రశాంత్ (Pallavi Prashanth) తిరిగాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా నామినేషన్స్ ప్రక్రియలో గొడవ జరిగింది. నామినేషన్స్ సమయంలో ప్రశాంత్ కు వ్యతిరేకంగా మాట్లాడింది రతిక. అప్పటినుండి ఓ వారం రోజుల పాటు మాట్లాడుకోని ఈ జంట.. మళ్ళీ ఒక్కటైనట్లు తెలుస్తోంది. హౌస్ లో అందరూ పడుకున్న తర్వాత వీరిద్దరు సరదాగా మట్లాడుకున్న వీడియోనే దీనికి సాక్షం. బిగ్ బాస్ బజ్‌లో ఈ లీక్ బయటకొచ్చింది.

వారం రోజులు బాగా ఆలోచించి రతికతో ఉన్న మనస్పర్థలను క్లియర్ చేసుకోవాలి అనుకున్న పల్లవి ప్రశాంత్.. ఆమె దగ్గరకు వెళ్లి తాను చేసిన తప్పులేంటో అడిగాడు. దీనికి రతిక చెప్పిన రిప్లై విని ఒప్పుకొని, ఇంకెప్పుడూ అలా చేయను అన్నాడు. అప్పటినుండి వీరిద్దరూ మళ్లీ మాట్లాడుకోవడం షురూ చేశారు. మెున్ననే ఫ్రెండ్స్ అంటూ చేతులు కలిపారు. అయితే తాజాగా బెడ్ రూమ్‌లో రతికతో ప్రశాంత్ కబుర్లు చెబుతున్న వీడియోను బిగ్ బాస్ బజ్ లో వదిలి కొత్త ఆసక్తి రేకెత్తించారు.

బెడ్ రూమ్‌లో రతిక పడుకొని ఉండగా.. గ్లాస్‌కు అటువైపు ప్రశాంత్ ఉండటం ఈ వీడియోలో చూడొచ్చు. కొంచెం ముందుకు రా అని ప్రశాంత్ అన్నట్టుగా వాయిస్ అయితే వినిపిస్తోంది. డ్యాన్స్ రాదని బాగా చేశావ్ అని రతిక చెప్పగా.. డిస్కో డ్యాన్సర్ అంటూ ప్రశాంత్ పాట పాడాడు. ఫ్లోర్ మూమెంట్ అంటూ కామెడీ కూడా చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకోవడం చూడొచ్చు. సో.. ఈ సీన్ చూస్తూనే మళ్ళీ రతిక- పల్లవి ప్రశాంత్ యవ్వారం షురూ అయిందని అర్థమవుతోంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందనేది!.

2023-09-19T13:39:32Z dg43tfdfdgfd