BIGG BOSS TELUGU 7: నా బిడ్డల మీద ఒట్టు, అందుకే ఇంకా హౌజ్‌లో ఉన్నాను - అసలు కారణం చెప్పిన శివాజీ

గతవారం జరిగిన కెప్టెన్సీ, ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులపైనే తాజాగా జరిగిన నామినేషన్స్ ఎక్కువగా ఆధారపడ్డాయి. గేమ్ సరిగా ఆడలేదని, సంచాలకులుగా సరిగా వ్యవహరించలేదని.. ఇలా నామినేషన్స్‌లో ఎక్కువగా ఇవే కారణాలు వినిపించాయి. పల్లవి ప్రశాంత్.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఆడిన బాల్స్ టాస్కులో సంచాలకుడిగా సరిగా వ్యవహరించలేదంటూ గౌతమ్.. తనను నామినేట్ చేయడంతో పెద్ద రచ్చే జరిగింది. ప్రశాంత్‌తో పాటు శివాజీని కూడా గౌతమ్ నామినేట్ చేశాడు. దీంతో తన నామినేషన్స్ అయిపోగానే గౌతమ్‌ను తిట్టుకున్నాడు శివాజీ. అంతే కాకుండా తనను తక్కువ చేసి మాట్లాడాడు.

గౌతమ్‌‌ను పిచ్చోడు అన్న శివాజీ..

‘‘స్ట్రాటజీతో నామినేషన్స్ మీద బ్రతికేస్తున్నాడు’’ అంటూ గౌతమ్ నామినేషన్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు శివాజీ. పిచ్చోడు అని కూడా అన్నాడు. శివాజీ మాత్రమే కాకుండా గౌతమ్ నామినేషన్స్‌ను అమర్ కూడా తప్పుబట్టాడు. ‘‘గౌతమ్ నీ మీద కాదు వేయాల్సింది’’ అంటూ ప్రశాంత్‌తో చెప్పాడు. సంచాలకుడిగా ప్రశాంత్‌ను నామినేట్ చేస్తే.. తప్పుగా ఆడినందుకు యావర్ మీద కూడా వేయాలి కదా అని పాయింట్ మాట్లాడాడు అమర్. నామినేషన్స్‌లో ఉన్నందుకు యావర్ ఫీల్ అవుతుంటే.. తన దగ్గరకు వెళ్లి మరోసారి గౌతమ్‌ను తిట్టాడు శివాజీ. ‘‘అబద్ధాలు మాట్లాడతాడు. పిచ్చోడు’’ అంటూ పదేపదే గౌతమ్‌ను పిచ్చోడని అన్నాడు.

అందుకే హౌజ్‌లో ఉన్నాను..

నామినేషన్స్ సమయంలో యావర్.. మరోసారి కోపంతో ఊగిపోయాడు. దీంతో శివాజీ మళ్లీ తనకు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ‘‘ఈ అయిదు వారాలు చాలా కీలకం. కోప్పడ్డకు అని చెప్పాను కదా’’ అని గుర్తుచేశాడు. దానికి సమాధానంగా నేను వెళ్లిపోతా అంటూ ఫీలయ్యాడు యావర్. ‘‘అది తప్పు. మీ అన్నకు మాటిచ్చావు’’ అని సెంటిమెంట్‌తో కొట్టాడు శివాజీ. ‘‘నువ్వు నమ్ము, నమ్మకపో. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా. చాలా బలవంతంగా ఉన్నాను నేను ఇక్కడ. మీరు హ్యాండిల్ చేయలేరు అనే ఉన్నాను’’ అని శివాజీ చెప్తుండగానే యావర్ ఏడవడం మొదలుపెట్టాడు. ‘‘ఎందుకు ఏడుస్తున్నావు. చేతకాదా? ఆడలేవా? తప్పు జరిగింది కదా. తప్పు గురించే ఆలోచిస్తావేంటి? నేను తెలియన వయసులో ఇలాంటి తప్పులు చేశాను. కోపంతో చేసుకున్నాను’’ అని శివాజీ.. యావర్‌ను మోటివేట్ చేయడానికి ప్రయత్నించాడు. ‘‘అమర్ అన్యాయం జరిగిందని చెప్తున్నాడు’’ అని అమర్‌దీప్ చెప్పిన నామినేట్ పాయింట్‌ను గుర్తుచేశాడు యావర్. ‘‘వాడిని ఆడియన్స్ చూసుకుంటారు. వాడిది తప్పు అయితే పంపిస్తారు. వాడు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. వాళ్లతో క్లోజ్‌గా ఉండాలి కాబట్టి’’ అని శోభాను అమర్ నామినేట్ చేయకపోవడాన్ని తప్పుబట్టాడు శివాజీ.

తనంతట తానుగా నామినేట్..

ఇక మిగతావారిలాగా కాకుండా అర్జున్ నామినేషన్స్ చాలా కూల్‌గా జరిగాయి. ఎవిక్షన్ ఫ్రీ పాస్ తనకు దక్కకపోవడానికి యావర్ ఆడిన గేమే కారణం అని యావర్‌ను ముందుగా నామినేట్ చేశాడు అర్జున్. ఆ తర్వాత బాల్స్ టాస్క్‌లో శివాజీ.. యావర్‌ను డిస్టర్బ్ చేశాడని తనను కూడా నామినేట్ చేశాడు. అందరికంటే చివరిగా నామినేట్ చేయడానికి వచ్చిన అశ్విని.. తన దగ్గర ఎవరిని నామినేట్ చేయడానికి ఏ పాయింట్ లేదని చెప్పింది. అయితే సెల్ఫ్ నామినేషన్ తప్పదని బిగ్ బాస్ చెప్పాడు. తాను సెల్ఫ్ నామినేట్ అవుతానని, సిల్లీ కారణాలతో ఎవరినీ నామినేట్ చేయను అంటూ తనంతట తానుగా నామినేషన్స్‌లోకి వెళ్లింది అశ్విని.

Also Read: ఏడుపును స్ట్రాటజీ అని బయటపెట్టిన అమర్ - అమ్మ మీద ఒట్టు అంటూ రతికను నామినేట్

2023-11-20T18:33:55Z dg43tfdfdgfd