BIGG BOSS TELUGU 7: ప్రశాంత్‌వి చిల్లర కథలు అన్న గౌతమ్, డాక్టర్ బాబు గాలి తీసేసిన రైతుబిడ్డ

బిగ్ బాస్ సీజన్ 7లో ఎక్కువశాతం నామినేషన్స్ అనేవి రెండురోజులు ప్రసారం అవుతున్నాయి. ఈసారి కూడా అదే జరిగింది. కంటెస్టెంట్స్ మధ్య ఎక్కువగా వాగ్వాదాలు జరుగుతుండగా.. నామినేషన్స్‌ను రెండు రోజులు ప్రసారం చేస్తున్నారు బిగ్ బాస్. ఇక ఈవారం జరిగిన నామినేషన్స్‌లో గౌతమ్, ప్రశాంత్‌ల మధ్య జరిగిన గొడవ హైలెట్‌గా నిలిచింది. ఒకరిపై ఒకరు అరుచుకోవడంతో పాటు మరోసారి వారి వృత్తులను కూడా మధ్యలోకి తీసుకొచ్చారు. ముందుగా గౌతమ్.. ప్రశాంత్‌ను నామినేట్ చేయగా.. ఆ తర్వాత ప్రశాంత్.. గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఇక ఈ ఇద్దరి నామినేషన్స్ సమయంలో సంబంధం లేకుండా మధ్యలోకి వచ్చిన యావర్.. గొడవను మరింత పెద్దగా చేశాడు.

సంచాలకుడిగా ఫెయిల్..

ముందుగా నామినేట్ చేయడానికి వచ్చిన గౌతమ్.. ప్రశాంత్ పేరును చెప్పాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్‌లో సంచాలకుడిగా ప్రశాంత్ చేసిన తప్పులను గుర్తుచేస్తూ తనను నామినేట్ చేశాడు గౌతమ్. ఆ టాస్కులో యావర్, శివాజీ.. ఇద్దరూ రూల్స్‌ను బ్రేక్ చేశారని చెప్పుకొచ్చాడు. దీంతో యావర్.. మధ్యలోకి వచ్చాడు. తాను తప్పు చేయలేదు అంటూ వాదించడం మొదలుపెట్టాడు. ఇది చూసిన శివాజీ సైతం తాము రూల్స్ బ్రేక్ చేయలేదని వాదించాడు. గౌతమ్ నామినేషన్స్ మధ్యలో వీరిద్దరూ చాలాసేపు జోక్యం చేసుకున్నారు. సంచాలకుడిగా తాను తప్పు చేసుంటే నాగార్జున చెప్పేవారని, చెప్పలేదు కాబట్టి తాను కరెక్ట్ చేశానని, నామినేషన్స్‌లో అసలు పాయింట్ లేదని ప్రశాంత్.. తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు. ‘‘నువ్వేం చేస్తున్నావు. సినిమా చూస్తున్నావా’’ అని ప్రశ్నించాడు గౌతమ్. ‘‘నేనేం టీవీలో చూడలేదు’’ అని కౌంటర్ ఇచ్చాడు ప్రశాంత్. కోపంలో గౌతమ్.. నువ్వెవరు అని అనగా.. నేను కూడా అలా అనొచ్చు అంటూ ప్రశాంత్ సమాధానమిచ్చాడు. ‘‘నువ్వు కత్తి పొడిచినప్పుడు నాకు రక్తం వస్తుంది కదా’’ అన్నాడు గౌతమ్. ‘‘నేనెందుకు పొడుస్తా. నాకేం తీట’’ అంటూ తన భాషలో ఆన్సర్ ఇచ్చాడు ప్రశాంత్. ఆ తర్వాత శివాజీ.. బాల్స్ గేమ్‌లో ఫౌల్ ఆడాడంటూ నామినేట్ చేశాడు గౌతమ్. శివాజీ తనతో ఎక్కువగా వాదించడానికి ప్రయత్నించకుండా నామినేషన్ ఒప్పకుంటున్నాను అని వెళ్లి కూర్చున్నాడు.

చిల్లర కథలు.. ఛీ..

రివర్స్ నామినేషన్స్‌తో ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్.. తనను నామినేట్ చేసిన గౌతమ్‌నే నామినేట్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్‌లో లెవెల్ 1లో గెలిచిన తర్వాత గౌతమ్ వల్లే లెవెల్ 2లో ఓడిపోయానని నామినేషన్‌కు కారణం చెప్పాడు. తన కారణం నచ్చని గౌతమ్.. వెళ్లి కూర్చున్నాడు. కానీ ప్రశాంత్ మాత్రం ఆపకుండా మట్లాడుతూనే ఉండగా.. గౌతమ్‌కు కోపమొచ్చింది. ‘‘మొత్తం నువ్వే మాట్లాడతావా? చెప్పేది వినవా?’’ అని మళ్లీ ప్రశాంత్ ముందుకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు గౌతమ్. వాగ్వాదం మధ్యలో గౌతమ్‌ది సేఫ్ గేమ్ అని ప్రశాంత్ అనగా.. అలాంటివి తాను చేయనని అరిచాడు గౌతమ్. ‘‘మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎక్కువ, తక్కువ మాట్లాడితే వినడానికి ఎవరూ రెడీగా లేరు’’ అన్నాడు. గౌతమ్ అరవడం చూసి ‘‘రెండు గోలీలు వేసుకో తక్కుతుంది ఏదైనా’’ అని వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చాడు ప్రశాంత్. అది గౌతమ్ పర్సనల్‌గా తీసుకున్నాడు. ‘‘ఇంకొకసారి ప్రొఫెషన్ మీద మాట్లాడొద్దు. వీటినే చిల్లర కథలు అంటారు. డాక్టర్ అంటే దేవుడులాగా. నా ప్రొఫెషన్‌ను ఇంకొకసారి అంటే బాగుండదు’’ అని గౌతమ్ సీరియస్ అయ్యాడు. అయితే తాను డాక్టర్ల గురించి ఏమీ అనలేదని, వారు దేవుళ్లు అని ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు. గౌతమ్‌తో వాగ్వాదం ముగిసిన తర్వాత రతికను నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు ప్రశాంత్. కెప్టెన్సీ టాస్కులో రతిక వల్లే తాను ఓడిపోయానని ప్రశాంత్.. నామినేషన్‌కు కారణంగా చెప్పాడు. దానిపై ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఇక వాగ్వాదం ముగించాలనుకున్న రతిక.. ప్రశాంత్ మాట్లాడుతుంది పట్టించుకోకుండా వెళ్లి చెవులు మూసుకొని కూర్చుంది.

Also Read: ఏడుపును స్ట్రాటజీ అని బయటపెట్టిన అమర్ - అమ్మ మీద ఒట్టు అంటూ రతికను నామినేట్

2023-11-20T18:33:56Z dg43tfdfdgfd