CASH SEIZE IN HYD: హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం

Cash Seize In Hyd: హైదరాబాద్‌లో మరోసారి భారీగా నగదు పట్టుబడింది. బొడుప్పల్ కు చెందిన మంద అనిల్ గౌడ్ (31) మరియు మహబూబ్‌నగర్ జిల్లా మేడిపల్లి కి చెందిన ఏర్పుల రవి (35)కారు డ్రైవర్లు గా పని చేస్తున్నారు.

వీరిద్దరూ కలిసి ఆదివారం ఉదయం కారులో వెళుతుండగా బేగంపేట్ గ్రీన్లాండ్ సిగ్నల్స్ వద్ద నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారి కారును తనిఖీ చేయడంతో అందులో భారీగా నగదు గుర్తించారు.

నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో వారి నుండి రూ.97.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సరైన పాత్రలు చుపించకపోవడంతో వాటిని పోలీసులు సీజ్ చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.నగరంలోని ఒక సివిల్ కాంట్రాక్టర్ వద్ద తాము డ్రైవర్లుగా పని చేస్తూన్నమని తమ యజమాని మరో బిల్డర్ కు ఇవ్వమని పంపితే డబ్బును తీసుకెళ్తున్నమాని వారు పోలీసులకు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రూ.625 కోట్లు సీజ్…

మరోవైపు తెలంగాణ ఎన్నికల సందర్బంగా ఇప్పటివరకు వివిధ మార్గాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.625 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు.

ఇప్పటివరకు రూ.99.49 కోట్ల మద్యం,రూ.34.35 కోట్ల మత్తు పదార్థాలు,రూ.78.62 కోట్ల వస్తువులు,రూ.179 కోట్ల విలువ చేసే బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగదు,బంగారం మరియు ఇతర వస్తువులకు సరైన పత్రాలు లేదా ఆధారాలు చూపించిన వారికి తిరిగి ఇచ్చేస్తున్నారని వివరించారు.

(కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)

2023-11-20T06:46:19Z dg43tfdfdgfd