CHANAKYA NITI TELUGU : ప్రతి ఒక్కరినీ మీ కంట్రోల్‍లో ఉంచుకునేందుకు ఏం చేయాలి?

భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరైన చాణక్యుడు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి అనేక మార్గాలను అందించాడు. చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇతరులను ఎలా ఒప్పించాలో, వారు మన మాట వినడానికి ఏం చేయాలో పేర్కొన్నాడు.

ఏదైనా విషయంలో ఒకరిని ఒప్పించడం చాలా కష్టమైన పని. కానీ కొందరిలో సహజంగానే ఈ లక్షణాలు ఉంటాయి. ఈజీగా ఒప్పించేస్తారు. చాణక్యుడు తన చాణక్య నీతిలో దీని గురించి చెప్పాడు. వీటి సహాయంతో మీరు ఇతరులను మీ మాటలకు కట్టుబడి లేదా నియంత్రణలో ఉండేలా చేయెుచ్చు. చాణక్యుడి నీతిలో పేర్కొన్న ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు ఈ గుణాన్ని పొందవచ్చు.

ఏదైనా విషయాన్ని ప్రజలకు చెప్పే ముందు లేదా దాని గురించి వారికి సమాచారం ఇచ్చే ముందు దాని గురించి పూర్తి సమాచారం లేదా జ్ఞానం కలిగి ఉండటం ముఖ్యం. ముఖ్యంగా, కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా మనసు మార్చుకోని చాలా మంది మన చుట్టూ ఉంటారు. వారి ఆలోచనా ధోరణి మారాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. ఆ విషయంపై మీకు పూర్తి పట్టు ఉంటే.. ఎదుటి వారిని ఈజీగా కన్విన్స్ చేయెుచ్చు.

డబ్బు ఇవ్వడం ద్వారానే అత్యాశగల వ్యక్తిని శాంతింపజేయగలమని చాణక్య నీతి చెబుతుంది. అంటే డబ్బు లేకుండా అత్యాశగల వ్యక్తిని మీరు ఆకర్షించలేరు. మీరు కొంత డబ్బు ఖర్చు చేయకుండా అత్యాశగల వ్యక్తులను మీ అభిప్రాయానికి ఒప్పించలేరు. డబ్బును ఆశ చూపిస్తే.. అత్యాశ ఉండే వ్యక్తులు ఈజీగా ఏ విషయానికైనా ఒప్పుకుంటారు. అప్పుడు వారి ద్వారా మనకు కావాల్సిన పనులు చేసుకోవచ్చు.

అహంకారం ఉన్న వ్యక్తిని ఒప్పించడానికి లేదా నియంత్రించడానికి మీరు వారికి నమస్కరించాలి. మీరు రిక్వెస్ట్ చేయడం లేదా తల వంచడం ద్వారా వారిని మీ దారికి తీసుకురావచ్చు. అహంకారులు తమ దారి సరైనదని భావిస్తారు. మీరు వారి మార్గాన్ని అనుసరించినట్టుగా చూపించాలి. వారికి దగ్గర అవ్వాలి. తర్వాత వినయంగా ఉంటూ మీకు కావాల్సిన పనులు చేయించుకోవాలి.

మీరు ఒక మూర్ఖుడిని ఒప్పించాలంటే, మీరు అతని మానసిక స్థితిని పరిశీలించి అతడిలా ప్రవర్తించాలి. ఇది అతనికి సంతోషాన్నిస్తుంది. మిమ్మల్ని వారు నమ్మేలా చేస్తుంది. అప్పుడు మాత్రమే మీరు అతనిని మీకు కావలసినది చేయమని అడగొచ్చు. అలా అయితేనే మీరు చెప్పింది వింటారు. లేదంటే మూర్ఖులలాగే బిహేవ్ చేస్తారు.

తెలివైన వ్యక్తి దేనికైనా నిజం చెప్పగలడు. దేన్నైనా ఒప్పించడానికి లాజిక్ మాట్లాడగలడు. అలాంటి వారిని నియంత్రించడానికి, మీరు కూడా తెలివిగా ఉండాలి. లేకపోతే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాట వినరు. మీ దారిలోకి రారు. మీరు ఎవరినైనా ఏదైనా విషయంలో ఒప్పించే ముందు, మీరు వారి వ్యక్తిత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలని, వారి స్వభావానికి అనుగుణంగా మీ ప్రవర్తనను సర్దుబాటు చేసుకోవాలని చాణక్యుడు సూచించాడు.

2023-11-20T02:38:48Z dg43tfdfdgfd