ఫెనోమ్ పెన్: కంబోడియాలో ఓ వ్యక్తి 40 మొసళ్లకు ఆహారం అయ్యాడు. తమ కుటుంబానికి చెందిన సరీసృపాల ఫామ్‌హౌజ్‌లోనే ఈ ఘటన జరిగింది. సీమ్ రీప్ ప్రాంతంలో ఉన్న ఓ మొసళ్ల ఎన్‌క్లోజర్‌లో పడ్డ 72 ఏళ్ల వ్యక్తిపై మూకుమ్మడి దాడి(Crocodiles Attack) చేశాయి. ఆ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
గుడ్లు పెట్టిన ఓ మొసలిని కేజ్ నుంచి తీస్తున్న సమయంలో.. ఆ వ్యక్తి పట్టుకున్న కర్రను మొసలి లాగేసింది. ఆ సమయంలో ఆ వృద్ధుడు మొసళ్ల కేజ్‌లో పడిపోయాడు. ఇక ఆ కేజ్‌లో ఉన్న మొసళ్ల గ్యాంగ్ అతనిపై దాడి చేశాయి. ఆ వ్యక్తి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాయి. కాంక్రీట్ ఎన్‌క్లోజర్ కాస్త పూర్తిగా రక్తసిక్తమైంది.
ఆ వ్యక్తి చేతిని మొసళ్లు కొరికేశాయని, కొన్ని మొసళ్లు ఆ చేయిని మింగేసినట్లు పోలీసులు తెలిపారు. కంబోడియాలో మొసళ్ల దాడి ఘటన ఇటీవల మరొకటి కూడా చోటుచేసుకున్నది.
2023-05-26T07:20:42Z dg43tfdfdgfd