Devutthana Ekadashi 2023: నవంబర్ నెల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ముఖ్యమైనది. ఈ నెలలో దీపావళి నుంచి మొదలుకొని కార్తీక పౌర్ణమి దాకా ఎన్నో మంచి రోజులు ఉంటాయి. కార్తీక పౌర్ణమి లో భాగంగా ఈ సంవత్సరం దేవతని ఏకాదశి వచ్చింది. పురాణాల ప్రకారం ఈ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం నవంబర్ 27వ తేదీన ఈ ఏకాదశి రాబోతోంది. కొంతమంది భక్తులు ఈ ఏకాదశి రోజే తులసి వివాహాన్ని కూడా జరుపుతారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ దేవతని ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో, ఈ సమయంలో ఏయే దేవత మూర్తిని పూజించాలో, పూజా సమయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దేవతని ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే శ్రీమహావిష్ణు యోగనిద్ర నుంచి మేల్కోవడం వల్ల ఈ సమయం నుంచి శుభముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో గృహప్రవేశాలతో పాటు పెళ్లిళ్లు చేసుకోవడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు ఐదు నెలల పాటు 53 వివాహ శుభ ముహూర్తాలు రాబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా తులసి వివాహాలను జరిపించాలనుకునేవారు ఈ సమయంలో చేయడం వల్ల మోక్షం లభించడమే కాకుండా జీవితంలో అన్ని సమస్యలు దూరమవుతాయి.
ఉపవాసాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది: ఈ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణు యోగనిద్ర నుంచి మేల్కోబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో తప్పకుండా మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేయడం చాలా మంచిదని పురాణాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సమయంలో ఉపవాసాలు పాటించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని భక్తుల నమ్మకం. అయితే శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేలుకొనే సమయంలో మాంసాహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు ఉంటారు:
పురాణాల్లో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల ఆనందం, శాంతి, ఆర్థిక శ్రేయస్సు స్వయంచాలకంగా వస్తాయి. ఈ తులసి మొక్క క్షీరసాదర మదనంలో ఉద్భవించిందని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ఈ తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్క ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని పద్మ పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే దేవతని ఏకాదశి రోజు తులసికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.
నవంబర్ నుంచి మార్చి మధ్య ఉన్న వివాహ ముహూర్తాలు ఇవే: 2023లో నవంబర్ 24, 27, 28, 29 డిసెంబర్ 03, 04, 05, 06, 07, 08,09, 13, 14 2024లో జనవరి 16,17,18, 20,21,22,27,28,29,30, 31 ఫిబ్రవరి 01, 02, 03, 04, 05, 06, 07, 12, 13, 14, 17, 18, 19, 23, 24, 25, 26, 27, 29. మార్చి 01, 02, 03, 04, 05, 06, 07, 08, 11, 12
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
2023-11-21T04:22:16Z dg43tfdfdgfd