DIRECTOR PARUSURAM: ఫ్యామిలీ స్టార్ రిజల్ట్తో సంబంధం లేకుండా..ఊహించని హీరోను పట్టిన పరశురామ్!

Director Parusuram: ఫ్యామిలీ స్టార్ రిజల్ట్తో సంబంధం లేకుండా..ఊహించని హీరోను పట్టిన పరశురామ్!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్(Parasuram)పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఆయన ఏ ముహూర్తాన సర్కారు వారి పాట(Sarkaruvaari pata) సినిమాను ఓకే చేశాడో తెలియదు కానీ..స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు.అలాగే తన సినిమాల్లో మంచి కంటెంట్ కూడా ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు కూడా.

రీసెంట్గా విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేసి థియేటర్స్ ఆడియన్స్ నుంచి మిక్సెడ్ టాక్ తో పాటు నెటిజన్స్ నుంచి ట్రోల్స్ ఎదుర్కున్నాడు.  అయితే, ఇటీవలే ఫ్యామిలీ స్టార్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.ముందుగా ఈ సినిమా థియేటర్లో ట్రోల్స్‌కు గురవటంతో ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోననే టెన్షన్ నెలకొంది.

అయితే,ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫ్యామిలీ స్టార్ మాత్రం దుమ్మురేపుతోంది.దీంతో ఆడియన్స్ కూడా పాజిటివ్ ట్వీట్స్ చేస్తున్నారు.ఇక ఈ రిసల్ట్తో విజయ్తో పాటు డైరెక్టర్ ట్రాక్ కూడా మారిపోయింది.ప్రస్తుతం వీరిద్దరూ తర్వాత సినిమాలపై సీరియస్ ఫోకస్ పెట్టారు.దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో VD 12 చేస్తున్నాడు.

ఇక డైరెక్టర్ పరశురామ్ ఎవ్వరు ఊహించలేని విధంగా యంగ్ ఎనర్జిటిక్ హీరోని పట్టేసాడు.హీరో రామ్ పోతినేని(Ram Pothineni)తో పరుశురామ్ నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట.ఇప్పటికే, ఈ హీరోకి స్టోరీని వినిపించాడట.దీంతో రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలో రామ్ లవర్ బాయ్గా నటిస్తున్నట్లు సమాచారం.త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.మరి ఈ సినిమాతో అయిన థియేటర్ ఆడియన్స్ను మెప్పిస్తాడో లేదో చూడాలి.ప్రస్తుతం రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నాడు..

పరశురామ్ సినిమాల విషయానికి వస్తే..

రచయిత-దర్శకుడుగా పరశురామ్ దాదాపు అర డజను తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు.నిఖిల్ సిద్ధార్థ్తో చేసిన యువత (2008)తో టాలీవుడ్‌లో దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. ఇది అప్పట్లో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది.అలాగే,రవితేజ నటించిన ఆంజనేయులు, సారొచ్చారు, అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు, విజయ్తో గీత గోవిందం సినిమాలు ఉన్నాయి. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-01T05:41:03Z dg43tfdfdgfd