FACT CHECKER: అదానీ పోర్ట్‌ నుంచి ఆవుల ఎగుమతి..? వైరల్ వీడియో నిజమైనదేనా..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌ను కొందరు కేటుగాళ్లు తప్పుడు అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో అనేక మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఎడిటెడ్ వీడియోలను సర్క్యులేట్ చేస్తూ, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.

(ఇది newschecker ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఫ్యాక్ట్ చేసిన స్టోరీ ఇది)

తాజాగా ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తప్పుడు పనులు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అదానీ పోర్ట్ నుంచి ఆవులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వీడియోలు వైరల్ చేస్తున్నారు. అసలు వీటిలో నిజం ఎంత?

Screengrab from X post by @StarShineM99, @AhmedPa92794538

వైరల్ వీడియో చూస్తే.. అదానీ పోర్ట్ వద్ద ఒక కంటైనర్‌లో, కాన్ని ట్రక్కుల్లో ఆవులు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ వీడియో ఇండియాలో తీసినది కాదని తెలుస్తోంది.

* ఫేక్ వీడియో

ఒక ఓడరేవులో కొన్ని ట్రక్కులు, వాటిలో ఆవులు ఉన్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో వైరల్ అవుతోంది. గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్ ద్వారా ఈ ఆవులను ఎగుమతి చేస్తున్నట్లు వీడియోను షేర్ చేసిన వారు పేర్కొన్నారు. అయితే ఇది నిజం కాదని ఫ్యాక్ట్ చెకింగ్ ప్లాట్‌ఫామ్ న్యూస్‌చెకర్ (Newschecker) గుర్తించింది. ఈ వీడియో ఇరాక్‌లోని ఒక ఓడరేవులో తీశారని తేల్చింది. అదానీ పోర్ట్ ద్వారా ఆవులను ఎగుమతి చేస్తున్నట్లు షేర్ అవుతున్న వార్త అవాస్తమని స్పష్టం చేసింది.

* ఇవి గమనించండి..!

Screengrab from viral video

వైరల్ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. దాంట్లో కనిపించే మగవాళ్లు పొడవాటి తెల్లని దుస్తులు ధరించారు. భారతదేశంలో ఇలాంటి వస్త్రధారణ ఎక్కడా కనిపించదు. అలాగే వైరల్ వీడియోలో కనిపించే ట్రక్కులపై 'మెర్సిడెస్ బెంజ్' లోగో ఉంది.

Screengrab from viral video
Screengrab from viral video

అసలు మెర్సిడెస్ బెంజ్ ట్రక్కులు ఇండియన్ మార్కెట్లలో లభించవు. మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ కంపెనీ అయిన డైమ్లర్.. ‘భారత్ బెంజ్’ పేరుతో ఇండియాలో ట్రక్కులను విక్రయిస్తోంది. భారత్ బెంజ్, మెర్సిడెస్ బెంజ్ లోగోలు భిన్నంగా ఉంటాయి.

వైరల్ వీడియోలోని కొన్ని ఫ్రేమ్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే.. ఈ వీడియో 2024 ఏప్రిల్ 19న, Hamed ELhagary అనే యూజర్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో షేర్ చేసినదని తేలింది. కానీ దీన్ని సేకరించి, అదానీ పోర్ట్ ద్వారా ఆవులు ఎగుమతి అవుతున్నట్లు చూపించారు.

Screengrab from Facebook post by user Hamed ELhagary

‘మీట్ మార్కెట్’ (అరబిక్ అనువాదం) అనే మరొక ఫేస్‌బుక్ అకౌంట్‌లో, “ఈద్-అల్-అధా కోసం సిద్ధమవుతోంది (అరబిక్ అనువాదం)” అనే క్యాప్షన్‌తో ఈ వైరల్ ఫుటేజీని షేర్ చేశారు.అలాగే యూట్యూబ్‌లో అల్ మయాదీన్ అనే ఛానెల్‌లో, ఇరాక్‌కు చెందిన ఉమ్ కస్ర్ (Umm Qasr) పోర్ట్‌ను చూపిస్తున్న వీడియో ఉంది.

(L-R) Screengrab from viral video and image of Iraq’s Umm Qasr Port
(L-R) Screengrab from viral video and image of Iraq’s Umm Qasr Port

ముగింపు:

యూట్యూబ్ వీడియోలో కనిపించిన పోర్ట్ విజువల్స్, వైరల్ ఫుటేజ్‌తో పోల్చి చూస్తే.. ఈ రెండూ ఒకే చోట తీసినవని తెలుస్తోంది. కాబట్టి, అసలు విషయం ఏంటంటే.. ఇరాక్‌లోని ఒక ఓడరేవులో పశువులను నింపిన ట్రక్కులు ఉన్న వీడియోను, అదానీ పోర్ట్ ద్వారా ఎగుమతి చేస్తున్న ఆవులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవి అదానీ పోర్ట్ విజువల్స్ కావు.

రిజల్ట్: ఇది నిజం కాదు.. తప్పుడు సమాచారం

(శక్తి కలెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా newschecker అందించిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఈ కథనం పబ్లిష్ చేశాం.)

2024-05-02T09:00:14Z dg43tfdfdgfd