GRUHALAKSHMI MAY 26TH: రాజ్యలక్ష్మిని బెదిరించిన దివ్య- అన్ని దారులు మూసేసి నందుని ఇరకాటంలో పడేస్తున్న లాస్య

నందుతో పని చేసిన కోలీగ్స్ కోర్టులో లాస్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు. కానీ వాళ్ళ మీద చీటింగ్ కేసులు ఉన్నాయని లాస్య తరఫు లాయర్ చెప్తాడు. ఈ సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోవడం లేదని జడ్జి అంటాడు. ఉన్న ఒక్క సాక్ష్యం చెల్లదని చెప్పేశారు మనం కేసు మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనని తులసి భయపడుతుంది. కోర్టు వాయిదా వేస్తారు. దివ్య తండ్రిని కౌగలించుకుని ఏడుస్తుంది. తన దగ్గర బలమైన సాక్ష్యం ఉండి కూడా లాస్య ఎందుకు ఆగిపోయిందని తులసి అనుమానపడుతుంది. మనవైపు నుంచి ప్రయత్నాలు ముగిసిపోయినట్టేనని నందు నిరాశపడతాడు. లాస్య వచ్చి చేతిలో సాక్ష్యం పెట్టుకుని ఎందుకు సైలెంట్ గా ఉన్నానని అనుకుంటున్నారా? ఏం లేదు ఆ వీడియో చూపించి కాంప్రమైజ్ చేద్దామని ట్రై చేస్తుందని నందు అంటాడు. ఎన్ని చేసినా కూడా నీతో కలిసి ఉండే అవకాశమే లేదని తెగేసి చెప్తాడు.

Also Read: ఇంటి కోడలికి కొడుకుతో చీర పెట్టించిన అపర్ణ- రాహుల్ నిశ్చితార్థం వేళ కావ్య కిడ్నాప్ అవుతుందా?

తన తండ్రి వెనుక తామందరం ఉన్నామని ఏమి చేయలేరని లాస్యకి దివ్య గట్టిగానే బదులిస్తుంది. లాస్య రాజ్యలక్ష్మికి ఫోన్ చేస్తుంది. కాస్త పెద్ద కోడలు కాళ్ళకి గొలుసులు వేసి ఇంట్లోనే పడేయమని చెప్తుంది. నీ కొడుకు కోడలు నందుకి బాడీ గార్డ్ లాగా నిలబడుతున్నారు నీ వాళ్ళు కాబట్టి వదిలేస్తున్నానని అంటుంది. వాళ్ళు బయట పడే దారి లేదు కాళ్ళ బేరానికి రావాల్సిందేనని ధీమాగా చెప్తుంది. దివ్యని గడప దాటకుండా చేస్తానని అంటుంది. విక్రమ్ లేకుండా దివ్య ఇంటి గడప కూడా దాటదు అలా జరగాలంటే అమ్మకి యాక్సిడెంట్ అయితే కాళ్ల దగ్గరే పడి ఉంటాడు కదా కావాలని సంజయ్ కారు డ్రైవ్ చేస్తుంటే యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది. నందు వాళ్ళ దగ్గర ఉండగా ప్రియ ఫోన్ చేసి రాజ్యలక్ష్మికి యాక్సిడెంట్ అయ్యిందని అమ్మకి దెబ్బ తగిలిందని చెప్తుంది. దీంతో కంగారుగా అందరూ బయల్దేరతారు.

Also Read: ఇంట్లో నుంచి మాళవికని గెంటేసిన అభిమన్యు- యష్, వేద ఫస్ట్ నైట్

విక్రమ్ పరుగున వచ్చి తల్లిని చూసి కంగారుపడతారు. కాలికి చిన్న ఫ్రాక్చర్ అయ్యిందని కాలు కదిలించకూడదని, జాగ్రత్తగా ఎవరో ఒకరు పక్కన కూర్చుని చూసుకోవాలని డాక్టర్ చెప్తుంది. అమ్మ పక్కన తను, దివ్య ఉంటామని అంటాడు. రెస్ట్ తీసుకోమని చెప్పి నందు, తులసి వెళ్లిపోతారు. లాస్య రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి ఏంటి యాక్సిడెంట్ అయ్యిందంట కదా అని అంటుంది. దివ్యని ఇంటికి మాత్రమే పరిమితం చేసేలా చాలా గొప్ప సహాయం చేశావు త్వరలోనే నందుని కేఫ్ కి దూరం చేయబోతున్నానని లాస్య తన ప్లాన్ చెప్తుంది. కేఫ్ కి దూరమయితే బతకలేరు అందుకే కుంభ స్థలాన్ని కొట్టబోతున్నా నందుని అణగతొక్కితే దివ్య కుంగిపోతుంది అప్పుడు నువ్వు తనని చెడుగుడు ఆడుకోవచ్చని అంటుంది. ఫోన్ పెట్టేయగానే దివ్య ఎంట్రీ ఇస్తుంది. ఏమంటుంది మీ జిగిరీ దోస్త్ ఫోన్లో మాట్లాడింది ఎవరో నాకు ఎలా తెలిసిపోయిందని అనుకుంటున్నారా? అన్నీ నాకు అలా తెలిసిపోతాయిలే. నేను ఆర్థోపెడిక్ సర్జన్ ని కాలు బాగు చేయడమే కాదు కాలు విరగగొట్టడం కూడా తెలుసని బెదిరిస్తుంది. ఏంటి మీ అమ్మకి చెప్తావా? అని రాజ్యలక్ష్మి ధైర్యంగా ఉన్నట్టు మాట్లాడుతుంది. కుడి కాలికి దెబ్బ తగిలితే ఎడమ కాలికి రిపోర్ట్ ఇచ్చారని మీ అబ్బాయికి చెప్పేదా అని షాకిస్తుంది. ఇప్పుడే కాదు మీ అబ్బాయికి నిజం త్వరలో చెప్తానని బెదిరిస్తుంది.   

2023-05-26T05:02:35Z dg43tfdfdgfd