Guppedantha Manasu Serial Today: జగతి గురించి తెలుసుకోవడానికి అనుపమ కాలేజీకి వచ్చిన విషయం తెలిసిందే. కాలేజీకి వచ్చిన అనుపమను రిషి, వసులు కలవకుండా శైలేంద్ర కుట్ర చేస్తాడు. తెలివిగా అనుపమను ఇంటికి తీసుకువస్తాడు. ఇక, ఇంటికి వచ్చిన అనుపమకు అసలు సూత్రధారి వసుధార అని, మహేంద్ర కూడా జగతిని ఎప్పుడ పట్టించుకోలేదు అని నమ్మేలా చెబుతూ ఉంటారు. ఈ మాటలన్నింటినీ అనుపమ నమ్మిందో లేదో తెలీదు కానీ, ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.. ఎండీ సీటు టాపిక్ వస్తుంది. దాని కోసం చాలా మంది జగతి పై కుట్రలు చేశారు అని శైలేంద్ర చెబుతాడు. దీంతో, అనుపమ.. నీకెప్పుడు ఆ ఎండీ సీటు పొందాలని అనిపించలేదా అని ప్రశ్నిస్తుంది. దానికి కాస్త షాకైన శైలేంద్ర, మళ్లీ ఎలాంటి తడబాటు లేకుండా, తనకు ఆ సీటు మీద మోజులేదని, అసలు అంత బాధ్యతలు తాను మోయలేనని చెబుతాడు. అలా ఎందుకు అనుకోవాలి? ఎవరికైనా ఆశ ఉంటుంది కదా అంటుంది. కానీ, శైలేంద్ర మాత్రం తనకు లేదని, వాళ్ల నాన్న లాగా కాలేజీకి వెళతాను, వచ్చేస్తాను అని చెబుతాడు.
ఇక, ఛాన్స్ దొరికిందని దేవయాణి అందుకుంటుంది. ఆ ఎండీ సీటు కారణంగా జగతి ప్రాణాలు పోయాయని, జగతి చనిపోగానే, ఆ ఎండీ సీటు వసుధారకు దక్కింది అని చెబుతుంది. వసుధారపై అనుమానం రావాలని నొక్కి మరీ ఆ విషయం చెబుతూ ఉంటుంది. తమ కాలేజీలో స్టూడెంట్ గా జాయిన్ అయిన వసుధార, ఆ తర్వాత రిషిని ప్రేమలో పడేసి, ఇప్పుడు ఏకంగా ఎండీ అయ్యిందని, ఎన్ని ఎత్తులు వేస్తే, ఆ స్థాయికి చేరుకుంటుంది అని అంటుంది. అంతేకాకుండా, తన కోడలు ధరణి లా కాదని, లోకం తెలిసిన పిల్ల అంటుంది. రిషి కూడా వసుని ప్రేమించాడట కదా అని అనుపమ ప్రశ్నించగా, ఆ వయసు అలాంటిది కదా అందుకే ప్రేమించాడు అని చెబుతుంది. ఆడపిల్ల చుట్టూ తిరుగుతూ ఉంటే, వయసులో ఉన్న పిల్లాడు ప్రేమలో పడక ఏం చేస్తాడు అని అంటుంది. దానికి, అనుపమ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అంటుంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు అని అనుపమ అంటే, దానికి దేవయాణి మాత్రం వెటకారంగా మాట్లాడుతుంది.
రిషి తాళి కట్టకుండానే వసుని భార్యగా అంగీకరించాడు. కానీ, జగతిని తల్లిగా అంగీకరించలేదు అని చెబుతుంది. అనుపమలో అనుమానం కలిగించేలా, జరిగిన విషయాన్ని మరోలా అర్థం వచ్చేలా తిప్పుతూ మాట్లాడుతుంది. చాలా సంవత్సరాలుగా భర్త ప్రేమకు దూరంగా ఉన్న జగతికి కన్న ప్రేమ కూడా దక్కలేదని, కన్నతల్లిని అమ్మ అని పిలవాల్సింది పోయి, మేడమ్ అని పిలిచేవాడని, కొడుకు ప్రేమ కోసం జగతి చాలా పరితపించిందని చెబుతుంది.రిషి అలా ఎందుకు చేశాడు అంటే చిన్నతనంలో వదిలేసి వెళ్లిపోయిందనే కారణంతోనే అలా చేసేవాడు అని చెబుతుంది. జగతి చనిపోయే వరకు కూడా అమ్మ అనే భావనతోనే చూడలేదని, మేం చెప్పినా మా మాట వినేవాడు కాదని, కనీసం వసుధార కూడా ఈ విషయంలో రిషికి ఏం చెప్పలేదంటుంది. మేడమ్, మేడమ్ అంటూ జగతి వెనక తిరిగేది కానీ, తల్లీ, కొడుకులను ఏ రోజు కలపలేదని వాపోతుంది. కుటుంబానికి దూరంగా ఉన్న జగతిని తానే బతిమాలి తీసుకువచ్చానని కానీ, వచ్చిన కొంతకాలానికే దూరమైపోయింది అని అంటుంది. మొత్తానికి జగతి చావు వెనక రిషి, వసులే ఉన్నారు అనే అర్థం వచ్చేలా గుచ్చి గుచ్చి మాట్లాడుతుంది.
దేవయాణి బుద్ది గురించి తెలిసిన అనుపమ, ఈ మాటలను పెద్దగా నమ్మినట్లు అనిపించడం లేదు. జగతి గురించి ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారని, అసలు నిజమేంటో తాను తెలుసుకుంటాను అని చెబుతుంది. అని చెప్పి, బయలుదేరుతాను అని వెళ్లిపోతుంది. శైలేంద్ర డ్రాప్ చేస్తానంటే కూడా వద్దు అని చెప్పి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత, తల్లీ కొడుకులు మాట్లాడుకుంటారు. ఎంత జీవించి చెప్పినా కూడా అనుపమ నమ్మలేదు అనుకుంటా అని శైలేంద్ర అడగగా, పూర్తిగా నమ్మకపోయినా అనుమానం అయితే వచ్చే ఉంటుందని, కచ్చితంగా మహేంద్ర దగ్గరకు వెళ్తుందని దేవయాణి చెబుతుంది. అంతేకాకుండా, శైలేంద్రను ఫాలో అవ్వమని కూడా చెబుతుంది.
సీన్ కట్ చేస్తే, కాలేజీలో ఓపెన్ అవుతుంది. కాలేజీలో క్లర్క్ వసు దగ్గరకు ఫైల్స్ తీసుకొస్తుంటే, మధ్యలో రిషి వాటిని తీసుకొని తానే ఇస్తానని చెబుతాడు. అక్కడకు వెళ్లిన తర్వాత తానే క్లర్క్ లాగా గొంతు మార్చి మాట్లాడుతాడు. రిషి, చూసుకోకుండా క్లర్క్ అనుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడూ వర్కే కాదు మేడమ్ ఫ్యామిలీని కూడా పట్టించుకోండి అని రిషి అంటే..నీకెందుకుయ్యా అని తలెత్తి చూస్తే, రిషి కనపడతాడు. ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. వారు గతంలో కలిసి పనిచేసిన సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటారు. ఇద్దరూ కలిసి కాలేజీ ఫైల్స్ చెక్ చేయడం మొదలుపెడతారు. ఆ పని అయిపోతే, ఇద్దరూ కలిసి బయటకు వెళ్లొచ్చు అనుకుంటారు. ఎండీ సీట్లో కూర్చోమని రిషిని వసు అడుగుతుంది. కానీ, రిషి అంగీకరించడు. కూర్చొనే చైర్ మీద కాదని, చేసే పనిమీద దృష్టి పెడితే చాలు అంటాడు. తర్వాత రిషి , మహేంద్ర కోసం ఇంటికి వెళతాడు. వసు మాత్రం తన పని అయిపోయిన తర్వాతే వస్తాను అంటుంది.
ఇక, అనుపమ రావడం, వీళ్లు ఇవన్నీ చెప్పడం విన్న ధరణి వెంటనే వసుధారకు ఫోన్ చేస్తుంది. అనుపమ ఇంటికి వచ్చిన విషయం మొత్తం చెప్పేస్తుంది. తాను మొత్తం వినలేదు కానీ, జగతి గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు అని చెబుతుంది. దీంతో, వసుధార అన్నీ తాను చూసుకుంటాను అని చెబుతుంది. ఆ తర్వాత వెంటనే రిషికి కాల్ చేస్తుంది. వెంటనే తాను కూడా రిషితోపాటు ఇంటికి వచ్చేస్తాను అని చెబుతుంది. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లిపోతారు.
మహేంద్ర ఇంట్లో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోపు కాలింగ్ బెల్ మోగుతుంది. డోర్ తీయగానే ఎదురుగా అనుపమ ఉంటుంది. లోపలికి రమ్మని మహేంద్ర పిలుస్తాడు. మరోవైపు శైలేంద్ర దొంగలా వచ్చి అన్నీ వింటూ ఉంటాడు. మహేంద్ర కాఫీ తెస్తాను అంటే, ఇప్పుడు నువ్వు కాఫీ పెడతావా అని అనుపమ అడుగుతుంది. కానీ, మహేంద్ర తనకు వసుధార ఆల్రెడీ కాఫీ ప్రిపేర్ చేసి ప్లాస్కోలో ఉంచిందని చెబుతాడు. అప్పుడు అనుపమ కాస్త వెటకారంగా, మీ కోడలు అన్నీ సిద్ధం చేసే వెళ్లిందా అంటుంది. నీ కొడుకు, కోడలు నిన్ను బాగా చూసుకుంటున్నారు అనుకుంటా అంటుంది. ఆ సమయంలో జగతి ఫోటో చూసి ఆగిపోతుంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదని, జగతికి అలా ఎలా జరిగిందని ఏడుస్తూ అడుగుతుంది. మహేంద్ర మాత్రం జగతి గురించి అడగొద్దదు అని అంటాడు. కానీ, అనుపమ ఒప్పుకోదు. జగతి గురించి తనకు అన్నీ తెలియాలి అని ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలని అడుగుతుంది.
అసలు నువ్వు జగతికి ఎందుకు దూరంగా ఉన్నావ్? జగతిని రిషి కూడా ఏరోజూ తల్లిగా ఎందుకు చూడలేదు అని అడుగుతుంది. వెంటనే మహేంద్రకు అనుమానం వస్తుంది. ఎక్కడికి వెళ్లి, ఇక్కడికి వచ్చావ్ అని అడుగుతాడు. దానికి మాత్రం అనుపమ సమాధానం చెప్పదు. జగతి గురించి మాత్రం తనకు తెలియాల్సిందేనని పట్టుపడుతుంది. నిన్ను నమ్మి జగతిని నీ చేతిలో పడితే తనను నువ్వు నడిరోడ్డు మీద వదిలేశావ్ అని అంటుంది. ఈలోగా రిషి, వసులు వచ్చేస్తారు. అది ముందే చూసేసిన శైలేంద్ర దాక్కుంటాడు. రిషి, వసులు అనుపమను చూసి ఆశ్చర్యపోతారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
2023-11-20T05:09:45Z dg43tfdfdgfd