INTER MARKS MEMO : తెలంగాణ ఇంటర్‌ మార్కుల మెమోలు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

TS Inter Marks Memo : తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. బుధవారం (ఏప్రిల్‌ 24) నాడు టీఎస్‌ ఇంటర్‌ ఫలితాలు (TS Inter Results 2024) విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్‌ మార్కులు చెక్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. తాజాగా తెలంగాణ ఇంటర్‌ మార్కుల షార్ట్‌ మెమోలను బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక.. తాజాగా విడుదలైన ఫలితాల్లో 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో 2.87 లక్షల మంది, ద్వితీయ సంవత్సరంలో 3.22 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌ నమోదు చేయడం ద్వారా షార్ట్‌ మెమో పొందొచ్చు.

  • ఇంటర్‌ ఫస్టియర్‌ మార్కుల మెమో లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి
  • ఇంటర్‌ సెంకడియర్‌ మార్కుల మెమో లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి

తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో స్టేట్‌ టాపర్లుగా ఇద్దరు అమ్మాయిలు నిలిచారు. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో మేడ్చల్‌ జిల్లాకు చెందిన వనపల్లి చరిష్మా శివ సాయి.. అలాగే సంగారెడ్డికి చెందిన ధ్రువి తప్లియాల్ అనే ఇద్దరు విద్యార్ధులు మొత్తం 1000 మార్కులకు గానూ 994 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్‌ సాధించారు. దీంతో ఇద్దరూ స్టేట్‌ ఫస్ట్ ర్యాంకర్లుగా నిలిచారు.

తెలంగాణ ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల 2024 షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ నిర్వహించే ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు డీఈవో దుర్గాప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ 25 నుంచి మే 2వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు మే3 న ప్రారంభమై మే 10 వరకు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-25T09:14:02Z dg43tfdfdgfd